పవన్‌ను మళ్లీ కెలికిన వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పవర్ స్టార్’ ఎలాంటి వివాదాన్ని సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే.

కాగా ఈ సినిమాను తాజాగా వర్మ తన ఏటీటీలో రిలీజ్ చేశాడు.

అయితే పవర్ స్టార్ సినిమాను రిలీజ్ కాకుండా ఉంచేందుకు పవన్ ఫ్యాన్స్ అన్ని విధాలుగా ప్రయత్నించారు.ఇందులో భాగంగా కొందరు వర్మ ఆఫీస్‌పై కూడా దాడి చేశారు.

అయితే వర్మ ఈ దాడితో మరింత రెచ్చిపోయాడు.కాగా మరోసారి వర్మ తనదైన మార్క్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా పవన్ కళ్యాణ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి వేడుకలో భాగంగా అతడిని ఆశీర్వదించేందుకు వెళ్లాడు.ఈ ఫంక్షన్‌లో పవన్ సరికొత్త అవతారంలో కనిపించాడు.

Advertisement

ఆయన ప్రస్తుతం చాతుర్మాస్య దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఆయన చాలా సింపుల్‌గా ఉండటంతో వర్మ, తన వ్యంగ్యాన్ని ప్రదర్శించాడు.

‘‘బాబు బాబా అయ్యారా?.మీ అశీర్వాదాలు కావాలి.

నేను బాబులను నమ్మను, బాబాలను నమ్మను, కానీ ఈ బాబు బాబాను నమ్ముతా’’ అంటూ వర్మ వ్యంగ్యంగా పోస్టులు పెట్టాడు.దీంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

వారు సోషల్ మీడియా వేదికగా వర్మను ఓ రేంజ్‌లో ఏసుకుంటున్నారు.తాను ఓ సెలబ్రిటీ అయ్యి ఉండి ఇలా పోస్టులు పెట్టడం సరికాదని, వెంటనే పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఈ టాలీవుడ్ సెలబ్రిటీల అకౌంట్స్ హ్యాక్.. దానివల్ల వారు పడిన ఇబ్బందులు..??

అయితే వర్మ మాత్రం డోంట్ కేర్ అంటూ పవర్ స్టార్ సినిమా రిలీజ్ చేస్తూ ఆనందిస్తున్నాడు.మరి ఈ వివాదం మరోసారి ముదురి ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు