జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇటీవల విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహించడం తెలిసిందే.ఈ క్రమంలో తాను రాజకీయాల్లో అనేక అవమానాలు ఎదుర్కొన్నట్లు.
అయినా గాని నిలబడినట్లు కీలక వ్యాఖ్యలు చేశారు.ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్( Abraham Lincoln ).అధ్యక్షుడు కాకముందు ఆయన ఎన్నో ఆటుపోట్లు ఓటములు ఎదుర్కొన్నారని చివరఖరికి అధ్యక్షుడు అయ్యారని పవన్ తెలియజేశారు.ఓటమి ద్వారా అనేక పాఠలు నేర్చుకున్నట్లు ప్రసంగించారు.
రాజకీయాలలో నిత్యం ప్రజల కోసం పోరాటం చేయడానికి తాను పార్టీ పెట్టినట్లు స్పష్టం చేశారు.ఇదే సమయంలో జనసేన పార్టీని ( Janasena party )ఏ పార్టీలో విలీనం చేసేది లేదని కూడా తెలియజేయడం జరిగింది.2019 ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత విశాఖపట్నంకి వచ్చిన సమయంలో.ప్రజలు లక్షలలో వస్తారని ఊహించలేదు.
నా కళ్ళు చెమరచాయని.పవన్ చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో అబ్రహం లింకన్ తో పవన్ పోల్చుకోవటంపై రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు.“అబ్రహం లింకన్ ఎవరికీ తెలియని సమయంలో ఓటమిపాలయ్యారు.మీరు ఒక సూపర్ స్టార్ గా ఉండి ఓడిపోయారు.మీ ఓటమి పోలిక తప్పుగా ఉందని” రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.