Ram Gopal Varma : ఆర్జీవీ చిన్నతనంలో అలాంటి పనులు చేశారా.. తల్లి ఏం చెప్పారంటే?

ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో ఒకరైన రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma )సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.ఆర్జీవీ తల్లి( RGV Mother ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Rgv Mother Shocking Comments Goes Viral In Social Media Details Here-TeluguStop.com

ఆర్జీవీ తల్లి పేరు సూర్యవతి కాగా ఆర్జీవీ బాల్యం నుంచి చాలా మేధావి అని పేర్కొన్నారు.ఇప్పుడు ఎలా ఉన్నాడో బాల్యంలో కూడా ఆర్జీవీ అలానే ఉండేవాడని ఆమె తెలిపారు.

మూడు సంవత్సరాల వయస్సులోనే ఏబీసీడీలు, వారాల గురించి చెప్పేవాడని ఆమె చెప్పుకొచ్చారు.అప్పటికి ఆర్జీవీ స్కూల్లో చేరలేదని ఆర్జీవీ తెలివి చూసి నేను షాక్ అయ్యేదానినని ఆమె కామెంట్లు చేశారు.

ఆర్జీవీ ఏకసంతాగ్రహి అని ఆమె చెప్పుకొచ్చారు.ఆ తర్వాత వర్మ స్కూల్ కు వెళ్లనని మారాం చేసేవాడని స్కూల్ యూనిఫాంను కొనిపెట్టగానే ఏం మాట్లాడకుండా స్కూల్ కు వెళ్లిపోయేవాడని ఆమె కామెంట్లు చేశారు.

ఆ తర్వాత స్కూల్ కు వెళ్లి టీచర్ నచ్చలేదని అనేవాడని ఆమె చెప్పుకొచ్చారు.నాకు కోపం వస్తే వర్మను కొట్టేదానినని సూర్యవతి అన్నారు.వర్మకు పరీక్షలలో కొన్నిసార్లు 90 మార్కులు వస్తే మరి కొన్నిసార్లు 30 మార్కులు వచ్చేవని అన్ని ప్రశ్నలకు జవాబులు తెలిసినా రాయాలని అనిపించలేదు కాబట్టి రాయలేదని ఆర్జీవీ చెప్పేవాడని ఆర్జీవీ తల్లి సూర్యవతి కామెంట్లు చేశారు.ఆర్జీవీ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అతనికి సెట్ అవ్వరని ఆమె తెలిపారు.

చిన్నప్పుడు నేను చాలా అందంగా ఉన్నానని ఆర్జీవీ చెప్పేవాడని నా ఫ్రెండ్స్ అందరి అమ్మల కంటే నువ్వే అందంగా ఉంటావ్ అని ఆర్జీవీ కామెంట్ చేసేవాడని సూర్యవతి అన్నారు.వర్మ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ తానే అంటూ వర్మ తల్లి సరదాగా కామెంట్ చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube