టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తరచు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు రాంగోపాల్.
నిత్యం ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తూ ఉంటాడు.అంతేకాకుండా రాంగోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా కాస్త బోల్డ్ గా మాట్లాడడంతో ఆ వాఖ్యలు తొందరగా వైరల్ అవుతూ ఉంటాయి.
పక్కన వారు ఏమనుకుంటారో అని కూడా అనుకోకుండా తనకు నచ్చినట్లు మాట్లాడడం నచ్చిన పని చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు రాంగోపాల్ వర్మ.
ఇది ఇలా ఉంటే రాంగోపాల్ వర్మ ఇదివరకే పబ్ లో అమ్మాయిలతో కలిసి డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా రాంగోపాల్ వర్మ కి సంబంధించిన అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.తాజాగా ఓ పార్టీలో భాగంగా లేడీస్ తో కలిసి వర్మ డ్యాన్స్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో రాంగోపాల్ వర్మ అమ్మాయిల తో కలిసి చిందులు వేస్తున్నాడు.
అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియో పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.కొందరు నెగిటివ్ గా కామెంట్ చేస్తుండగా మరికొందరు రాంగోపాల్ వర్మ కి మద్దతుగా కామెంట్ చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ ఎక్కువగా అడల్ట్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.అదేంటి అని పలువురు ప్రశ్నిస్తే నచ్చితే సునిమాలు చూడండి లేదంటే మానేయండి అంటూ ఆర్జీవి ముఖం మీద కుండలు బద్దలు కొట్టినట్టుగా చెబుతున్నాడు.
అంతే కాకుండా ఆర్జీవి మాట్లాడే కొన్ని మాటలు యూత్ లో కొంతమందిని ఆకర్షిస్తున్నాయి.