రివర్స్ గేర్.. రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అవుతుందా ?

కర్నాటక ఎన్నికల్లో( Karnataka elections ) గెలిచిన తరువాత అన్నీ రాష్ట్రాలలోని కాంగ్రెస్ నేతలు కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు.ముఖ్యంగా టి కాంగ్రెస్ నేతలకైతే కర్నాటక విజయం ఇచ్చిన కిక్కు అంతా ఇంటా కాదు.

 Will Revanth Reddy's Plan Work Out Details, Revanth Reddy,congrees Party,revanth-TeluguStop.com

తెలంగాణలోనే విజయం సాధించినట్లుగా టి కాంగ్రెస్( T Congress ) నేతలు జబ్బలు చారుస్తున్నారు.ఇకపోతే రానున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు తెలంగాణలో చతికిల పడ్డ కాంగ్రెస్ ఇప్పుడు నయా జోష్ తో సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది.

Telugu Congrees, Congress, Karnataka, Revantareddy, Revanth Reddy, Revanthreddy,

ముఖ్యంగా ఇతర పార్టీలలోని నేతలను ఆకర్శించేందుకు కర్నాటక విజయన్నే ప్రతిబింబంగా చూపిస్తున్నారు టి కాంగ్రెస్ నేతలు.గతంలో పార్టీ వీడిన వారు తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని, పార్టీ ఎల్లప్పుడు ఆహ్వానం పలుకుతుందని ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth reddy ) చెప్పుకొచ్చారు. కొండ విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ వంటి వాళ్ళను పార్టీలో చేర్చుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అయితే పార్టీ నుంచి బయటకు వెళ్ళిన నేతలంగా కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి వైఖరి నచ్చకపోవడం వల్లే పార్టీ వీడినట్లు చెప్పుకొచ్చారు.

Telugu Congrees, Congress, Karnataka, Revantareddy, Revanth Reddy, Revanthreddy,

ఇప్పుడు వారినందరిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి.తన మీద కోపం ఉంటే పార్టీ కోసం ప్రజల కోసం పది మెట్లు దిగడానికి తాను సిద్దమేని గతంలో పార్టీ వీడిన వాళ్ళు తిరిగి మళ్ళీ పార్టీలోకి రావాలని ఆయన కోరారు.అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ వంటి వాళ్ళు పార్టీ మారే ప్రసక్తే లేదని, తాము బిజెపిలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు.

కాగా ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే బిజెపి కొంత మెరుగైన పొజిషన్ లో ఉందనేది కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట.అయితే బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని, చాటిచెప్పాలంటే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరగడం చాలా ముఖ్యం అందులో భాగంగానే రేవంత్ రెడ్డి తానను తాను తగ్గించుకొని నేతలను ఆకర్షించే పనిలో పడ్డారని రాజకీయవర్గాల ఇన్ సైడ్ టాక్ మరి రేవంత్ రెడ్ది ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube