బీఆర్ఎస్ఎల్పి విలీనం దిశగా రేవంత్ స్కెచ్ ?

తెలంగాణ అధికార పార్టీ లోకి చేరికల జోరు పెరుగుతోంది.

ముఖ్యంగా బి ఆర్ ఎస్ నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున మండల ,నియోజకవర్గ స్థాయి నాయకులు కాంగ్రెస్ లో చేరిపోగా , వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి , తెల్లం వెంకట్రావు తదితరులు కాంగ్రెస్ లో చేరగా తాజాగా మాజీ స్పీకర్ , బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి( Pocharam Srinivas Reddy ) కాంగ్రెస్ లో చేరిపోయారు.ఇంకా అనేకమంది కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తుండడంతో, వారిని చేర్చుకుని కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసి, బిఆర్ఎస్ ను బలహీనం చేయాలనే ప్లాన్ లో రేవంత్ రెడ్డి ఉన్నారు.

అందుకే ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టారు.

Revanths Sketch Towards The Merger Of Brslp , Brs, Brslp , Congress, Bjp, Revan

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని, త్వరలోనే కూలిపోతుందంటూ బిఆర్ఎస్, బిజెపి నేతలు పదే పదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, ఆ విమర్శలను రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు.దీనిలో భాగంగానే బిఆర్ఎస్, బిజెపి( BRS, BJP ) నుంచి ఎక్కువమంది నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.వరుసగా కాంగ్రెస్ లో వచ్చి చేరుతున్న నేతలపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ దాఖలు చేసి, వారిపై అనర్హత వేటుపడేలా చేస్తుందనే ముందస్తు జాగ్రత్త తో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ ఒకేసారి చేర్చుకుని బిఆర్ఎస్ఎల్పి నీ కాంగ్రెస్ లో విలీనం చేసే విధంగా రేవంత్ ( Revanth Reddy)ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
Revanth's Sketch Towards The Merger Of BRSLP , BRS, BRSLP , Congress, BJP, Revan

అలా జరిగితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే అవకాశం ఉండదని, రాజకీయంగా ఇది తమకు కలిసి వస్తుందని , భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితి ఉండదని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు.

Revanths Sketch Towards The Merger Of Brslp , Brs, Brslp , Congress, Bjp, Revan

em>బీఆర్ఎస్ , బిజెపిల నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైతే రకరకాల పదవులు ఇస్తామని హామీలు ఇస్తూ సంప్రదింపులు మొదలుపెట్టారట.వీలైనంత తొందరగా బీ ఆర్ ఎస్ బిజెపి ఎమ్మెల్యేలను చేర్చుకుని, త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు