రైతుబంధుపై రేవంత్ సంచలన నిర్ణయం!

సాధారణంగా ఒక ప్రభుత్వంలో కొనసాగిన పథకాలు ప్రభుత్వం మారగానే వాటి పేర్లు మారటమో లేక నిబంధనలు మారటమో జరుగుతూ ఉంటాయి.పైగా ఒక పార్టీకి చాలా మంచి పేరు తెచ్చిన పథకాన్ని కొనసాగించడానికి సహజంగా తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇష్టపడవు.

 Revanth's Sensational Decision On Rythubandhu , Rythu Bandhu Scheme , Revanth-TeluguStop.com

ఎందుకంటే ఆ పథకాల కొనసాగితే దాని తాలూకు క్రెడిట్ ఆ పథకాన్ని మొదలుపెట్టిన వారికే వెళుతుంది అన్న భయాలు ఆ పార్టీలను వెంటాడుతూ ఉంటాయి.ఒక రకం గా చూస్తే కేసీఆర్ మానస పుత్రికలుగా చెప్పబడిన పథకాలలో రైతుబంధు పథకం ఒకటి .తెలంగాణ వ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం నిమిత్తం ఏర్పాటు చేసిన రైతుబంధు పథకం కెసిఆర్( kcr ) ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది.ముఖ్యంగా తెలంగాణలో పెద్ద మొత్తంలో ఉన్న రైతులు అందరి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచిన పథకం కింద దీనిని చెప్పుకోవచ్చు .ఈ పథకం రెండుసార్లు కేసీఆర్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది అనడం లో కూడా సందేహం లేదు.

Telugu Congress, Farmers, Revanth Reddy, Rythubandhu, Ts-Telugu Political News

అయితే ఇప్పుడు కాంగ్రెస్ ( Congress )అధికారం లోకి రాగానే కాంగ్రెస్ మార్కు పథకాలు అమలులోకి వస్తాయని చాలామంది భావించారు.అయితే అధికారం లోకి వచ్చిన దగ్గరనుంచి తనదైన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రైతుబంధుపై కూడా సంచల నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతానికి రైతుబంధు పథకం అదే పేరుతో కొనసాగించాలని పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన అధికారులు ఆదేశించడం సంచలనంగా మారింది.

ఎందుకంటే రైతుల ఇబ్బందులను ప్రాథమికంగా దృష్టిలో పెట్టుకోవాలని, ఏవైనా మార్పులు చేర్పులు నిబంధనల మార్చాల్సి ఉంటే తర్వాత చూసుకోవచ్చని, ముందు రైతులకు( Rythu Bandhu Scheme ) ఏ ఇబ్బంది కలగకుండా ఇది సరైన సమయం కాబట్టి నిధులు విడుదల చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Congress, Farmers, Revanth Reddy, Rythubandhu, Ts-Telugu Political News

అంతేకాకుండా అర్హులను దృష్టిలో పెట్టుకొని మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన అధికారులు ఆదేశించారట.అలాగే కాంగ్రెస్ హామీ ఇచ్చిన నట్లుగా ఈ మొత్తాలను పెంచడంపై కూడా యంత్రాగం అప్పుడే కసరత్తు మొదలుపెట్టిందట .మరి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా పెంచిన నిధులను కూడా విడుదల చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube