రేవంత్ విషయంలో చంద్రబాబు సైలెంట్..రీజన్ ఇదే

ఒక పార్టీ నుంచీ మరొక పార్టీకి ఎవరన్నా జంప్ చేస్తే.వారి మీద మాటల దాడి విషయంలో రాజీపడరు.

నంద్యాల సమయంలో శిల్పా సోదరులు తెలుగుదేశం పార్టీని విడిచి వెళ్ళినపుడు టిడీపి నేతలు ఎలా మాట్లాడారో చంద్రబాబు ఏమ్మన్నారో అందరికీ తెలిసిన విషయమే.చిన్న స్థాయి నాయకుడైనా సరే మతాల యుద్దంలో రాజీ ఉండదు.

అలాంటిది.టీ టీడీపీ వ‌ర్కింగ్ క‌మిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యే ప‌ద‌వికి, అటు పార్టీ స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేయ‌డం ఈ క్ర‌మంలోనే పార్టీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం మౌనంగా ఉండ‌డం పరిశీలిస్తే అసలు టిడిపిలో ఏమి జరిగింది .ఇది నిజమేనా అని ఒక్కసారి గిల్లుకుని చెక్ చేసుకుంటారు.అసలు చంద్రబాబు కి ఏమయ్యింది.

తెలంగాణలో కేసీఆర్ తో దోస్తు కోసం రేవంత్ ని పక్కన పెట్టారా? అసలు ఏమి జరిగింది అనే ప్రశ్న ఇప్పుడు ఏపీ ప్రజలలో సందేహం గా మిగిలిపోయింది.చంద్రబాబు మౌనం వెనుకాల అసలు విషయం వింటే మీరు షాక్ అవ్వక మానరు.

Advertisement

తమ పార్టీ కీలక వ్యక్తీ మరొక పార్టీలోకి వెళ్తుంటే అధ్యక్షుడిగా చంద్రబాబు బాబు మాట్లాడక పోవడం వెనుక పెద్ద వ్యూహం ఉందని తెలుస్తోంది.అటు బాబు కానీ, ఇటు రేవంత్ కానీ.

తెలంగాణ‌లో వెలుగు చూసిన ఓటుకు కోట్లు కుంభ‌కోణంలో ప్ర‌ధాన పాత్ర‌ధారులే.టీడీపీ ఎమ్మెల్సీని గెలిపించ‌డం కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్ ఓటును కొనుగోలు చేసేందుకు టీడీపీ ప్ర‌య‌త్నించింది.

ఈ విష‌యంలో రేవంత్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.ఈ క్ర‌మంలోనే రేవంత్ అయితే, జైల్లో కూడా ఉండి వ‌చ్చారు.

ఈ నేప‌థ్యంలో ఈకేసు ప్ర‌స్తుతం తెర‌మ‌రుగు అయింది.కానీ, ఈ కేసులో మాత్రం అటు బాబు, ఇటు రేవంత్‌లు మాత్రం నిందితులుగానే ఉన్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
గిరిజనులతో సరదాగా డ్యాన్స్ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు

ఈ విషయం అందరికీ విధితమే.ఇక్కడే బాబు సైలెంట్ వెనుక కారణం ఉంది.

Advertisement

రేవంత్‌కు బాబుతోను, బాబుకు రేవంత్‌తోను ఈ కేసు విషయంలో ఎవరి సహకారం వారికి కావాలి దీనిని దృష్టిలో పెట్టుకున్న చంద్ర‌బాబు.రేవంత్ పార్టీ మారుతున్న‌ప్ప‌టికీ.

ఏమీ అన‌కుండా మౌనంగా ఉండిపోయారు.ఒక‌వేళ‌… బాబు ఏమ‌న్నా కామెంట్లు చేస్తే.

రేవంత్ వాటికి ఫీలైతే.మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని బాబు భావించారు.

రేవంత్ మాత్రం టి-టిడిపి నేతలని మాత్రం టార్గెట్ చేసి మాట్లాడారు.కేసీఆర్ టిడిపి నేతలు ఒక్కటే అంటూ చేసిన విమర్శలు తెలంగాణలో పెద్ద దుమారాన్ని రేపాయి.

ఏపీ మంత్రులపై కూడా టార్గెట్ చేసి మాట్లాడాడు.ఈ విషయంలో కూడా చంద్రబాబు మౌనాన్నే ప్రదర్శించారు రేవంత్ ఇష్టానికే వ‌దిలేశారు.

మొత్తానికి పాత గాయం మళ్ళీ రేపితే అసలే ఎలక్షన్స్ సమయం వస్తోంది.ఈ సమయంలో రేవంత్ తుట్టె రేపితే మనకే భారీ నష్టం అని భావించిన చంద్రబాబు.

తేలు కుట్టిన దొంగలా మిన్నకుండిపోయారు.ఇది బాబు మౌనం వెనుక అసలు స్టొరీ.

తాజా వార్తలు