ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ .. ఆ పదవుల భర్తీపై రానున్న క్లారిటీ

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న వివిధ రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )నేడు ఢిల్లీకి వెళ్తున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీకి ఏడాది పూర్తి కాబోతున్న నేపథ్యంలో,  విజయోత్సవాలు నిర్వహించే విషయంలో అధిష్టానం పెద్దలతో రేవంత్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు .

Revanth, Who Is Going To Delhi, Is The Clarity That Will Come On The Replacement

ఈ మేరకు ఏఐసిసి పెద్దలతో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.వారందరిని విజయోత్సవాలకు హాజరు కావలసిందిగా రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు.సోనియా గాంధీ , రాహుల్ గాంధీ లను ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు.

  డిసెంబర్ 9 న తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం( Mother of Telangana statue unveiling event ) ఉన్న నేపథ్యంలో,  ఆ కార్యక్రమానికి సైతం హాజరవ్వాల్సిందిగా రేవంత్ ఆహ్వానించనున్నారు.ఇక తెలంగాణలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ పైన రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు.

ఎప్పటి నుంచో 6 మంత్రి స్థానాల భర్తీపై రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.అయితే ఎప్పుడుకప్పుడు ఏదో ఒక అడ్డంకి ఏర్పడడంతో అది కాస్త వాయిదా పడుతూ వస్తోంది.

Revanth, Who Is Going To Delhi, Is The Clarity That Will Come On The Replacement
Advertisement
Revanth, Who Is Going To Delhi, Is The Clarity That Will Come On The Replacement

దీంతో ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లి , ఎవరెవరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలి, ఏ ఏ సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యం ఇవ్వాలి అనే అంశాలపైనా చర్చించనున్నారట.వీలైనంత తొందరగా మంత్రి వర్గాన్ని విస్తరించి, పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టాలనే ఆలోచనతో రేవంత్ ఉన్నారట.డిసెంబర్ రెండో వారం లో అసెంబ్లీ సమావేశాల ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆ సమావేశాల కంటే  ముందుగానే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలి అనే ఆలోచనతో రేవంత్ ఉన్నారట.వీటితో పాటు, ఖాళీగా ఉన్న కార్పొరేషన్ పదవుల భర్తీ , కుల గణన వంటి అంశాలపైనా రేవంత్ చర్చించనున్నారట.

Advertisement

తాజా వార్తలు