తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ రాజ్ భవన్ లో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.
రాత్రి 8.15 గంటలకు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారని స్పష్టం అవుతుంది.అదేవిధంగా డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ మేరకు రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది.
ఉదయం నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో సీఎల్పీ నేతగా, సీఎం అభ్యర్థిగా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పేరునే ప్రతిపాదించారు.ఈ క్రమంలో ఎమ్మెల్యేల ఏకవాక్య తీర్మానంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది.
మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు.