తెలంగాణ ప్రజలకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగే ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రజలంతా రావాలని ఆహ్వానించారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం ఆసన్నమైందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.కాగా ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలను రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
అదేవిధంగా సుమారు 300 మంది అమరవీరుల కుటుంబాలు, 250 మంది తెలంగాణ ఉద్యమకారులకూ టీపీసీసీ ఆహ్వానం పలికింది.







