సొంత నేతలకు రేవంత్ మార్క్ వార్నింగ్ !

తెలంగాణలో పార్టీని ఒక గాడిలో పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయిపోయింది.ఈ మేరకు ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మే నెలలో తెలంగాణలో పర్యటించబోతున్నారు.

 Revanth Reddy Warning To Own Party Leaders Details, Revanth Reddy, Telangana, Co-TeluguStop.com

ఇప్పటికే సొంత పార్టీలోని నాయకుల వివాదాల పై దృష్టిసారించిన కాంగ్రెస్ అధిష్టానం గ్రూపు రాజకీయాలు అసంతృప్తి లేకుండా చూడడంతో పాటు , తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది  అనే అంశాన్ని హైలెట్ చేసి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి,  టిఆర్ఎస్ పార్టీలకు గట్టి షాక్ ఇవ్వాలని, తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఇప్పుడు గ్రూపు రాజకీయాల పైన,  అసంతృప్తి నాయకుల పైన సీరియస్ గా నిర్వహించబోతున్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు.

వాస్తవంగా కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు అనేది సర్వసాధారణంగా మారిపోయాయి.ఎప్పటి నుంచో పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం ఇవన్నీ కాంగ్రెస్ ప్రత్యర్థులకు బాగా కలిసి వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.పార్టీలో ఎంతటివారైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని గీత దాటితే వేటు తప్పదన్న హెచ్చరికలు జారీ చేశారు.

కాంగ్రెస్ కు ఐకమత్యమే మహాబలం అని,  అందుకు భిన్నంగా ఎవరైనా పార్టీ ముఖ్యుల పైన వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పైన, బహిరంగంగా , సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే పార్టీ నుండి బహిష్కరణ తో పాటు, క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
 

Telugu Congress, Congress Senior, Pcc, Rahul Gandhi, Revanth Reddy, Telangana-Po

అసలు తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉండేది.అయితే పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు,  సీనియర్ నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని  సీనియర్ నాయకులు ఎవరు ఒప్పుకోకపోవడం ఇలా అనేక కారణాలతో ఏదో ఒక వివాదం కాంగ్రెస్ లో వస్తూనే ఉంటోంది.ఈ రకమైన విభేదాలతో ఎన్నికలకు వెళ్తే మళ్లీ పార్టీకి ఘోర పరాజయం తప్పదని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు సూచనలతో రేవంత్ ఇప్పుడు అలెర్ట్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube