రేవంత్ రెడ్డి టిడిపి నుంచీ కాంగ్రెస్ లోకి రాగానే ఎదో ఒక బాంబు పెల్చుతాడు అసలే ఫైర్ బ్రాండ్ కదా అనుకున్నారు అనుకున్నట్టుగానే కెసిఆర్,కేటిఆర్ లను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ కేసులో కొత్త ఆరోపణలు చేస్తూ సంచలనం సృష్టించాడు.ఆ తరువాత కోతకాలం కాంగ్రెస్ అధిష్టానం తనకి ఇచ్చే పదవి విషయంలో అలసత్వం చేయడం వలన.
కొంత సందిగ్ధంలో పడిన రేవంత్ ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ టిఆర్ఎస్ ని టార్గెట్ చేశాడు.
నిన్న అచ్చంపేటలో భారీ ర్యాలీ చేసిన రేవంత్ టిఆర్ఎస్ పై విమర్సల వర్షం గుప్పించాడు.
అయితే రేవంత్ టార్గెట్ ఈ సారి టిఆర్ఎస్ మంత్రులపై పడింది.గతంలో మంత్రులు టీఆర్ఎస్ ప్లీనరీ ఖర్చుల కోసం గులాబీ కూలీ చేసిన విషయాన్ని వివాదం చేస్తున్నారు.
టిఆర్ఎస్ మంత్రుల గులాబీ కూలీ పనిదినాలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు రేవంత్ రెడ్డి.ఈ పరిణామానికి ఒక్కసారిగా మంత్రులు అందరు ఉలిక్క పడ్డారు.
కూలీ పేరుతో మంత్రులు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశారని రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా వ్యాఖ్యానించడం తెలిసిందే దీనిపై చర్యలు తీసుకునేలా కోర్టుని ఆశ్రయిస్తా అంటూ ఆరోపణలు చేశారు.
అయితే ఈ విషయంలూ రేవంత్ ఆరోపణలకే పరిమితం కాలేదు.
దీన్ని ఆచరణలో పెట్టారు కూడా.మంత్రులు చేసిన పని ముమ్మాటికీ బహిరంగ లంచం తీసుకోవడమేనని…తెలంగాణ మంత్రుల కూలి సంపాదనపై అవినీతి నిరోదక చట్టం కింద విచారణ జరపాలని ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
కానీ ఏసీబీ స్పందించలేదని అందుకే ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించినట్లు చెబుతున్నారు రేవంత్ రెడ్డి.ఈ విషయమై విచారణకు ఆదేశించాలని పిటీషన్ లో న్యాయస్థానాన్ని కోరారు రేవంత్.
ఇప్పుడు రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయానికి మంత్రులలో టెన్షన్ మొదలయ్యింది.రేవంత్ హైకోర్టులో వేసిన పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.ఒక వేల రేవంత్ పిటిషన్ పరిగణలోకి తీసుకుని తీర్పు చెప్తే మంత్రులు చిక్కుల్లో పడ్డట్టే అంటున్నారు సినియర్ విశ్లేషకులు.గత కొంత కాలంగా రేవంత్ కాంగ్రెస్ లో సైలెంట్ గా ఉండటం తో ప్రశాంతంగా ఉన్న టిఆరెస్ కి ఇప్పుడు రేవంత్ గట్టి షాకే ఇచ్చాడు.
రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుకాల కారణం లేకపోలేదు.రేవంత్ కీ ఎటువంటి పదవి ఇవ్వాలో అని ఆలోచిస్తున్న అధిష్టానం కి మళ్ళీ ఈ అంశం మరో ఆలోచన ఇచ్చే అవకాశం లేకుండా తన సత్తా చాటడానికి ఇలా చేశాడు అంటున్నారు.
మరి రేవంత్ స్టామినా చూసి అయినా సరే కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో.ఈ పిటిషన్ పై కేసీఆర్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.







