' ఇస్తవా... చస్తవా ' ! రేవంత్ సరికొత్త ఉద్యమం

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం సక్సెస్ అయితే తమకు ఇబ్బంది తలెత్తుతుందనే భయం తెలంగాణలోని అన్ని పార్టీల్లోనూ ఉంది.

అయితే కేసీఆర్ కేవలం ఎన్నికల వరకు మాత్రమే ఆ హామీని అమలు చేస్తారని, ఆ తర్వాత అది అమలు చేయడం అసాధ్యమనే అభిప్రాయంలో మిగతా పార్టీల నేతలు ఉన్నారు.

అయితే కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ద్వారా కేవలం దళిత సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే లబ్ధి పొందుతూ ఉండడంతో,  మిగతా సామాజిక వర్గాల్లో కాస్త అసంతృప్తి ఉంది .దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని,  టిఆర్ఎస్ కు ఇబ్బంది తలెత్తేలా చేయాలనే వ్యూహంతో టిఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు.      ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ విషయంపై పూర్తిగా దృష్టి పెట్టారు.

ఆయన ఆధ్వర్యంలోనే ఇంద్రవెల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని ప్రయత్నిస్తున్నారు.నేడు సభను సక్సెస్ చేసి టిఆర్ఎస్ పై జనాల్లో వ్యతిరేకత పెంచాలని చూస్తున్నారు.

కేవలం హుజురాబాద్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు మాత్రమే ఈ పథకాన్ని టిఆర్ఎస్ తీసుకొచ్చిందని విమర్శలు చేస్తున్నారు.  నేటి నుంచి సెప్టెంబర్ 17 వరకు అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

10 లక్షలు ఇస్తవా చస్తవా అనే నినాదంతో ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.తెలంగాణలోని ప్రతి దళిత గిరిజన ఆదివాసులకు 10 లక్షలు ఇవ్వాలంటూ రేవంత్ డిమాండ్ మొదలుపెట్టారు.

కాంగ్రెస్ చేపట్టబోయే నిరసన కార్యక్రమాల్లో ఒకరోజు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ హాజరవుతారని రేవంత్ చెబుతున్నారు.     

  ఇంద్రవెల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను ఏ ఆటంకం లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర రెడ్డి ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.తెలంగాణలో నాలుగైదు బహిరంగ సభలను ఏర్పాటు చేసి తమ బలం పెంచుకోవాలని , హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ బిజెపి మధ్యే ప్రధాన పోటీ అన్నట్లుగా ప్రచారం జరుగుతుండటంతో, ఆ పరిస్థితిని మార్చి కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థిని నిలబెట్టి పట్టు నిలుపుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!
Advertisement

తాజా వార్తలు