కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇంట్లో దొరికిన వాటితో పెద్దగా ప్రయోజనం ఉండదని వాటితో… ఓ చిన్న కేసు కూడా పెట్టలేమని ఐటీ అధికారులు నిర్ధారణకు వచ్చారు.ఓటుకు నోటు కేసు విషయాన్ని ఐటీ అధికారులు పదే పదే .
రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తావించారు.ఎన్ని సార్లు అడిగినా అది కుట్ర కేసు అని మాత్రమే రేవంత్ రెడ్డి చెప్పారు.
మూడో తేదీన రేవంత్ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.కేవలం భార్య పేరు మీద ఉన్న రూ.కోటి వరకూ డిపాజిట్లు.బంధువు కేఎల్ శ్రీధర్ రెడ్డి ఇంట్లో దొరికిన రూ.కోటి నలభై లక్షల గురించి వివరాలు తెలుసుకోవడానికే ఆ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.

రేవంత్ ఇంటిపై జరిగిన దాడుల్లో ఏమి దొరికాయన్న విషయం అధికారంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించలేదు.పెద్దమొత్తంలో ఆస్తులు దొరికితే.ఈ పాటికి.
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు ఆ ఆస్తులకు సంబంధించిన వివరాలతో హడావుడి చేసి ఉండేవారు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కానీ మీడియాలో మాత్రం అమెరికా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్‌లలో అక్రమాస్తులంటూ హడావుడి చేశారు.
కానీ అసలు విషయం మాత్రం వేరే.రేవంత్ రెడ్డి ఇంట్లో ఒక్క రూపాయి కూడా అదనపు సొమ్ము దొరకలేదు.
రేవంత్ సమీప బంధువు కేఎల్ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో రూ.కోటి నలభై లక్షలు మాత్రం స్వాధీనం చేసుకున్నారు.రేవంత్ ఇంట్లో రూ.కోటి డిపాజిట్లకు సంబంధించిన బ్యాంక్ డీటైల్స్ మాత్రం తెలుసుకున్నారు.రేవంత్ భార్య గీతకు సంబంధించిన బంగారు ఆభరణాలను లాకర్‌ను తెప్పించారు.అయితే వాటికి సంబంధించిన రసీదులు వారు చూపించారట.

విదేశీ బ్యాంక్ అకౌంట్లంటూ కొన్నింటినీ రేవంత్ ముందు పెట్టి ప్రశ్నించినా వాటితో తనకేమీ సంబంధంలేదని తనకు ఒక్క విదేశీ బ్యాంక్ అకౌంట్ కూడా లేదని.ఐటీ అధికారులు వివరణ అడిగిన సమయాల్లో తాను ఆయాదేశాలకు వెళ్లను కూడా వెళ్లలేదని.కావాలంటే.ఇమ్మిగ్రేషన్ నుంచి సమాచారం తెప్పించుకోవచ్చని రేవంత్ వారికి నేరుగానే సమాధానం చెప్పారు.ఇంట్లో జరిగిన సోదాల్లో కానీ.కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌ల నుంచి కానీ.
విదేశీ ఖాతాలకు సంబంధించిన సమాచారం ఏమీ దొరకలేదట.మూడు రోజుల పాటు.14 చోట్ల సోదాలు చేసి ఏమి దొరకలేదంటే ఇదేదో రాజకీయ కుట్ర అనే అవకాశం ఉన్నందున దీనిపై ఐటీ శాఖ నోరు మెదపడంలేదనే అనుమానాలు కలుగుతున్నాయి.