మంగళవారం నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ( PM Modi ) పర్యటించి అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు.ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నీ( CM KCR ) ఉద్దేశించి మోదీ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత ఎన్డీఏలో చేరుతానని కేసీఆర్ తన దగ్గరకు వచ్చినట్లు మోదీ సంచలన వ్యాఖ్యలు చేశరు.అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రిగా తాను రాజీనామా చేసి కేటీఆర్ నీ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పుకొచ్చినట్లు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) స్పందించారు.మోదీ నోట తన చీకటి మిత్రుడు మాట బయటకు వచ్చిందని విమర్శించారు.ఇప్పటికైనా ముసుగు తొలగి నిజం బయటికి వచ్చిందని.అన్నారు.కేసీఆర్ – మోదీది ఫెవికాల్ బంధం అనే కాంగ్రెస్ చెప్పిందే నిజమైందని స్పష్టం చేశారు.బీజేపీ-బీఆర్ఎస్ చీకటి మిత్రులు.
ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ పడతారు.ఇలా తాము చెప్పిందే నిజమైందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
నిప్పులాంటి నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదని స్పష్టం చేశారు.కాగా నిజామాబాద్ బహిరంగ సభలో మోదీ… కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు.
తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి.మోదీ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మంత్రులు ఖండిస్తున్నారు.