తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.కేవలం కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గానే రాజకీయం జరిగిందని తెలిపారు.
కుతంత్రాలతో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించారని నారాయణ స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందన్నారు.
దీని వలన పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు మేలు జరిగిందని పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి ఇప్పటికీ టీడీపీనేనని తెలిపారు.