ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు జోష్ పెరిగింది.బీఆర్ఎస్ బిజెపిలలోని అసంతృప్తి నాయకులు చాలామంది కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండడం ఆ పార్టీలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
అధికార పార్టీ బీ ఆర్ ఎస్ ను ఓడించి కాంగ్రెస్ జెండాను తెలంగాణలో ఎగురవేస్తాము అనే ధీమా ఆ పార్టీ నాయకుల్లో కలుగుతోంది.ఇక బిజెపి తమకు పోటీనే కాదు అన్న అభిప్రాయంతో కాంగ్రెస్ ఉంది.
ప్రస్తుతం చేరుతున్న నేతలతో పాటు , ఇంకా అనేకమంది కీలక నాయకులను పార్టీలో చేర్చుకునే విధంగా రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు.దీనిలో భాగంగానే పాత పరిచయాలను తెరపైకి తెస్తున్నారు.
ఈ మేరకు మాజీ టిడిపి నేతలపై రేవంత్ ఫోకస్ పెట్టారు.గతంలో రేవంత్( Revanth Reddy ) కూడా టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరడంతో , అప్పట్లో ఆ పార్టీలో ఒక వెలుగు వెలిగి ఇతర పార్టీలో చేరిన నేతలపై దృష్టి సారించారు.

అప్పట్లో కాంగ్రెస్ అంత బలంగా లేకపోవడంతో , టిడిపి నుంచి బయటికి వెళ్లినవారు బీఆర్ఎస్ , బిజెపిలలో చేరిపోయారు.అక్కడ సరైన ప్రాధాన్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.దీంతోపాటు మరి కొంతమంది ఇంకా టిడిపిలోనే కొనసాగుతున్నారు .అటువంటి నేతలను గుర్తించి వారితో రేవంత్ మంతనాలు చేస్తున్నారు.కొంతకాలం క్రితమే మక్తల్, దేవకద్ర నియోజకవర్గాలకు చెందిన సీతా దయాకర్ రెడ్డి( Seetha Dayakar Reddy) కూడా రేవంత్ తో భేటీ అయ్యారు కాంగ్రెస్ లో చేరాలనే ఉద్దేశంతో టిడిపికి రాజీనామా చేశారు.కానీ దయాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో సైలెంట్ అయ్యారు.

ఆ తర్వాత ఆయన మరణించారు.ఇక హైదరాబాద్ సిటీలో బలంగా ఉన్న టిడిపి నేతలను ఆహ్వానించేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే వారిలో చాలామంది బీఆర్ఎస్ లో చేరడంతో , వారిని కాంగ్రెస్ లో చేరే విధంగా ఒప్పిస్తున్నారు.ఎమ్మెస్ శ్రీనివాస్ , కోనా శ్రీశైలం గౌడ్( Kuna srisailam Goud ) వంటి వారితో చర్చలు జరిపారు.
ఇంకా అప్పట్లో టిడిపిలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ గా ఉంటున్న నేతలకు రేవంత్ ఆహ్వానాలు పంపుతున్నారు.కాంగ్రెస్ లో చేరితే తగిన ప్రాధాన్యం ఇస్తానని, తనకున్న పాత పరిచయాలతో వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే అనేకమంది టిడిపి మాజీలు రేవంత్ హామీతో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యార
.






