కాంగ్రెస్ లో ఐక్యత మేడిపండు చందమేనా ?

కర్ణాటక ( Karnataka )ఎన్నికలను చూసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కలుపుకుపోవడం నేర్చుకున్నారని ఐక్యంగా ఉండి పోరాడితే విజయం దక్కుతుందని స్పూర్తి ని తీసుకొని తమలో ఉన్న విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.పార్టీలోకి కీలక నాయకులను ఆకర్షించగలగటం, ప్రజాకర్షణ పథకాలను హామీలుగా ప్రకటన చేయటం, భారీ బహిరంగ సభలకు ప్రజలను సేకరించగలడంతో కాంగ్రెస్కు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని , ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ట్రాక్ లో కి వచ్చిందనే విశ్లేషణలు వినిపించాయి.

 Revanth Gave The Weapon Brs , Karnataka, Brs, Revanth, Congress Leaders, Revant-TeluguStop.com
Telugu Congress, Karnataka, Revanth, Revanthgave, Revanth Reddy-Telugu Political

అయితే అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఉచిత విధ్యుత్ పై చేసిన వ్యాఖ్యలపై సహచర కాంగ్రెస్( Congress ) నేతల స్పందన చూసినప్పుడు కాంగ్రెస్లో ఐక్యత మేడిపండు చందమేనని అర్థమవుతుంది అసలు రేవంత్ ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారు? ఆ వ్యాఖ్యలు పూర్తి సారాంశం ఏమిటో తెలియకుండానే రేవంత్ వ్యాఖ్యలపై తలో రకంగా మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేతలు తమ మధ్య ఐక్యత అన్నది అసంబవమని తేల్చేశారు.ఒకవేళ ఏదైనా పొరపాటు మాట్లాడి ఉన్నా కూడా పార్టీ పరంగా అంతర్గతంగా చర్చించుకుని సవరించుకోవాలే తప్ప ఇలా ప్రజల ముందు, మీడియా సాక్షిగా పలుచన అయ్యేలా పరస్పర వ్యతిరేఖ స్టేట్మెంట్లు ఇవ్వటం ఏమిటో కాంగ్రెస్ నాయకులకే తెలియాలి .

Telugu Congress, Karnataka, Revanth, Revanthgave, Revanth Reddy-Telugu Political

ఏది ఏమైనా రేవంత్ తన వ్యాఖ్యల ద్వారా ఇప్పుడు ముప్పేట ఎదురుదాడి చేయడానికి ఒక అస్త్రాన్ని అదికార పార్టీకి ఇచ్చినట్టయింది.ఆ అస్త్రాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న అధికార బారసా పార్టీ .రేవంత్ రెడ్డి వ్యాఖ్య లపై గత రెండు రోజులుగా అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించింది .సాదారణ కార్యకర్తలు మొదలుకుని ఎంఎల్ఏ లు మంత్రుల కూడా ఈ విషయం లో స్పందిస్తూ కాంగ్రెస్ ఇమేజ్ ని డామేజ్ చేసేలా వాఖ్యలు చేస్తున్నారు .మరి రేవంత్ ఈ వ్యతిరేఖత ను తట్టుకొని ఎలా నిలబడతారో చూడాలి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube