బిగ్ బాస్ సీజన్6 విన్నర్ రేవంత్ అని ఫ్యాన్స్ ఎప్పుడో ఫిక్స్ అయ్యారు.అయితే నాగార్జున శ్రీహాన్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పడంతో రేవంత్ అభిమానులు ఒకింత ఫీలవుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా రేవంత్ కు కొన్ని విషయాలలో అన్యాయం జరిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ సీజన్6 చెత్త సీజన్ అంటూ రేవంత్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
అనధికారికంగా, అధికారికంగా నిర్వహించిన ఎన్నో సర్వేలలో రేవంత్ కు అనుకూలంగా ఓట్లు వచ్చాయని రేవంత్ కాకుండా శ్రీహాన్ కు ఓట్లు ఎక్కువగా ఎలా వస్తాయని బిగ్ బాస్ ఫ్యాన్స్ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఫినాలేలో ఇద్దరు కంటెస్టెంట్లు ఉన్న సమయంలో డబ్బులు ఆఫర్ చేయడం సరి కాదని రేవంత్ ఫ్యాన్స్ నాగార్జునపై, బిగ్ బాస్ యజమాన్యంపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతుండటం గమనార్హం.
బిగ్ బాస్ హౌస్ మేట్స్ శ్రీహాన్ ను డబ్బు తీసుకోమని చెప్పడం కూడా కుట్రలో భాగమేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ప్రేక్షకుల ఓట్లకు విలువిచ్చాడు కాబట్టే రేవంత్ ట్రోఫీకి ప్రాధాన్యత ఇచ్చారని డబ్బే ముఖ్యమని రేవంత్ భావించి ఉంటే 40 లక్షల ఆఫర్ కు ఓకే చెప్పి ఉండేవాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.50 లక్షలు బ్రీఫ్ కేస్ లో ఉన్నా రేవంత్ ట్రోఫీకే ప్రాధాన్యత ఇచ్చేవారని మరి కొందరు చెబుతున్నారు.
ఇప్పటికే బిగ్ బాస్ షో విషయంలో ఎన్నో విమర్శలు ఉండగా ఈ మధ్య కాలంలో ఈ షోపై విమర్శలు మరింత పెరుగుతున్నాయి.రేవంత్ నిజాయితీని నమ్ముకున్నాడని అతని ఫ్యాన్స్ చెబుతున్నారు.బిగ్ బాస్ షో విజేతగా నిలిచిన రేవంత్ కెరీర్ రాబోయే రోజుల్లో మరింత పుంజుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బిగ్ బాస్ షో తర్వాత రేవంత్ కు భారీ ఆఫర్లు వస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.