వెంకట్ కళ్యాణ్ హీరోగా ఆయన దర్శకత్వంలోనే గాయత్రి పటేల్ హీరోయిన్ గా…అబూజ, శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పై సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మించిన చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా.ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని విడులకు సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోని ఆదివారం ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం పాల్గొని ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేశారు.
ఇక ట్రైలర్ లాంచ్ అనంతరం వేదికపై నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ హాస్యనటులు తీసే సినిమాలు సక్సెస్ కావాలని, హాస్యం బయటకు రావాలని మా గురువుగారు జంధ్యాలగారు ఎప్పుడు చెప్పేవారు.
హాస్యాన్ని బతికించాలని కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వేడుకకు వచ్చానని ఈయన తెలిపారు.

ఇక సినిమాల గురించి బ్రహ్మానందం మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో సినిమాలకు పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడా ఎప్పుడూ ఉండదని అలాంటి వ్యత్యాసాలను ఎవరు చూపించరని తెలిపారు.సినిమా చిన్నదైనా పెద్దదైన కంటెంట్ ఉంటే అలాంటి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఈ సందర్భంగా బ్రహ్మానందం సినిమాల గురించి చేసినటువంటి ఈ కామెంట్ వైరల్ అవుతున్నాయి.ఒకప్పుడు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి బ్రహ్మానందం ప్రస్తుతం వయసు పై పడటంతో కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈయన తాజాగా పంచతంత్రం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.







