సక్సెస్ ఫార్ములాను ఎవ్వరైనా ఫాలో అవుతారు కదా.అది సినిమాల్లో అయినా సరే లేదంటే రాజకీయాల్లో అయినా సరే.
ఒక చోట ఒక పద్ధతి సక్సెస్ సాధించింది అంటే దాన్ని ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేందుకు ట్రై చేస్తుంటారు కదా.అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా ఇలాంటి రాజకీయమే ఒకటి తెరమీదకు వచ్చిందండోయ్.
అది చూసిన తర్వాత మీరు కూడా ఔననే సమాధానం ఇస్తారు.గతంలో జగన్ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో నినాదాలు ఇచ్చారు.
ఇందులో రావాలి జగన్, కావాలి జగన్‌తో పాటు బాయ్ బాయ్ బాబు కూడా చాలా ఫేమస్.
అయితే ఇప్పుడు ఇందులో ఒకటి అయిన బాయ్ బాయ్ బాబు అనే ఫార్ములాను వాడేస్తున్నారు రేవంత్ రెడ్డి.
నిన్న కేసీఆర్ నల్గొండకు వెళ్లి ఎన్నో ప్రసంగాలు చేశారు.ఇందులో భాగంగా కేంద్రంలో తన సత్తా చూపించేందుకు వెళ్తానని కూడా చెప్పారు.
తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటూ చెప్పడం కూడా ఇక్కడ గమనార్హం.అయితే ఈ ప్రసంగంపై రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు.
కేసీఆర్ తన ప్రసంగంలో మోడీకి భయపడ్డాడని చెప్పుకొచ్చారు.మోడీ తెలంగాణను అవమానిస్తే కేసీఆర్ మాత్రం ఘాటుగా నిలదీయలేకపోయారంటూ చెప్పుకొచ్చారు.
మోడీ కామెంట్లపై తెలంగాణ బిడ్డ అయిన ఎవ్వరైనా ఘాటుగా నిలదీస్తారని, కానీ కేసీఆర్ మాత్రం దాన్ని పక్కదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు.ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని రాసుకొచ్చారు.చివరగా బైబై కేసీఆర్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.ఇది గతంలో జగన్ ఇచ్చిన నినాదం.అంటే ఆ సక్సెస్ ఫార్ములాను ఇప్పుడు రేవంత్ కూడా ఇస్తున్నారంట.అయితే వీరిద్దరూ గొడవ పడటం అంతిమంగా బీజేపీకి లాభం చేకూరుస్తుందా అంటే చెప్పలేం.
ఎందుకంటే వీరిద్దరూ పోరాడుకుంటే.బీజేపీ తన పని తాను చేసుకుపోయే ఛాన్స్ ఉంది.