కాంగ్రెస్ కార్యకర్తలపై రేవంత్ ఫైర్ ! సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరిక

సొంత పార్టీ కార్యకర్తలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ఫైర్  అయ్యారు.పార్టీ నియమావళిని ఉల్లంఘిస్తే  ఎంతటి వారినైనా ఉపెక్షించను అని హెచ్చరించారు.

 Revant Fire On Congress Workers! Warning Of Suspension, Telangana Congress, Pcc-TeluguStop.com

తరుచుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో ఒక అంశం పై గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు.ఈ వ్యవహారం పై రేవంత్ సీరియస్ అయ్యారు.

ఇకపై గాంధీ భవన్ లో ఎవరైనా ఆందోళన చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.తాజాగా పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతుందంటూ కొంతమంది నాయకులు గాంధీ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు.

సరిగ్గా అదే సమయంలో రేవంత్ గాంధీభవన్ కి వచ్చారు.ఈ ఆందోళన కార్యక్రమంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేస్తూ కనిపించడంతో , వారి వివరాలను సేకరించాల్సిందిగా గాంధీభవన్ మార్గాలను రేవంత్ ఆదేశించారు.

Telugu Aicc, Aleru Congress, Gandhi Bhavan, Komativenkata, Pcc, Revanth Reddy-Po

ఆలేరు నియోజకవర్గంలో ఎనిమిది మండలాలకు 7 మండలాల అధ్యక్షులను నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఐలయ్య , ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ( komatireddy venkata Reddy )అనుకూలంగా ఉన్నవారిని నియమించినా, ఒక మండలాన్ని మహిళలకు ఇవ్వడానికి వ్యతిరేకస్తూ ఈ ఆందోళన చేపట్టడంపై రేవంత్ ఘాటుగాను ప్రశ్నించారు.తక్షణమే ఆందోళన విరమించకపోతే సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడబోనని హెచ్చరించారు.ఆందోళన చేపట్టిన వారి వివరాలను సేకరించాల్సిందిగా పిసిసి ఉపాధ్యక్షుడు కుమార్ రావును ఆదేశించారు.అలాగే మొన్నటి వరకు మండల కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్న శంకర్ నాయక్ ను సస్పెండ్ చేయాలని ఆలోచించారు .

Telugu Aicc, Aleru Congress, Gandhi Bhavan, Komativenkata, Pcc, Revanth Reddy-Po

ఇక పై ఎవరు అందోళన చేసినా ఊరుకునేది లేదని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.పార్టీ నిబంధన ఉల్లంఘించి ఆందోళన చేపట్టే వారిపై చర్యలు తీసుకోవాలని పిసిసి క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు చిన్నారెడ్డి( Chinna Reddy ) కి రేవంత్ సూచించారు.కమిటీల నియామకాలపై  అభ్యంతరాలు ఉంటే.ఇకపై పార్టీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వేం నరేంద్ర రెడ్డికి వినతిపత్రం అందజేయలని రేవంత్ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube