అమెరికాలో వివిధ కారణాల వలన ఉద్యోగాలు చేసుకుంటూ ఉండే ఎంతో మంది వివిధ దేశాల ఎన్నారైలకి కంటిమీద కునుకు లేకుండా పోతోంది.ఇప్పటికే వీసాలా విషయంలో ట్రంప్ సర్కార్ పెట్టిన షరతులు ఎన్నారైలకి చుక్కలు చూపిస్తున్నాయి…ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ నిభందనలు అన్నిటినీ సడలించుకుంటూ భారతీయ ఎన్నారైలే టార్గెట్ చేశాడు ట్రంప్.
అందుకే వలసల విధానంలో కూడా ట్రంప్ తీరుపై సర్వాత్రా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇదిలాఉంటే ట్రంప్ ప్రవేశపెట్టిన నూతన విధానం ఇప్పుడు హెచ్1 బీ వీసా దారులకి నిద్రలేకుండా చేస్తోంది.ఈ విధానంపై ఎట్టిపరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్తున్నారు.ఇంతకీ ఆ కొత్త నిభందన ఏమిటంటే అమెరికాలోని ఉద్యోగాలను, ఉద్యోగులను హెచ్1బీ వీసా పొందిన వారితో భర్తీ చేయకుండా చేయడమే ఆ బిల్లు యొక్క ముఖ్యమైన లక్ష్యం.ఈ బిల్లునే సభలో ప్రవేశపెట్టి.
యూఎస్ కాంగ్రెస్ ఆమోదం తెలిపేలా చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.ట్రంప్ సర్కార్.
అయితే ఈ బిల్లు పాస్ అయితే చాలా సంతోషమని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్నా తెలిపారు.వలస సంస్కరణల వలన అమెరికా తన అవసరాలకి తగ్గట్టుగా ఉద్యోగాలని కల్పించేలా సంస్థలకు ఉన్న సదుపాయాలపై నిషేధం విధించడమే దీనికి సరైన విరుగుడు అంటూ ఆయన ప్రకటించారు.అయితే అత్యంత ప్రతిభావంతులకి మాత్రం ఉద్యోగాల కల్పనా ఉంటుందని తెలిపారు ఫ్రాన్సిస్.
అయితే ఈ తాజా నిభందనలు అమలు అయితే మాత్రం భారీ స్థాయిలో భారతీయులు వెనక్కి వచ్చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు టెక్ విశ్లేషకులు.
.