కామారెడ్డి, జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.జగిత్యాల, కామారెడ్డి మున్సిపల్ కౌన్సిళ్లు అత్యవసరంగా సమావేశమైయ్యాయి.
ఈ క్రమంలో మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ తీర్మానం చేశారు.
అయితే, గత కొన్ని రోజులుగా మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా కామారెడ్డి, జగిత్యాలలో రైతులు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని ఒత్తిళ్లు తీసుకురావడంతో పాటు నిరసనలు తీవ్రతరం చేశారు.ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ముసాయిదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అదేవిధంగా ముసాయిదాను తయారు చేసిన డిజైన్ డెవలప్ మెంట్ ఫోరం, డీటీసీపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







