2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిపబ్లికన్ పార్టీ( Republican Party ) మరో డిబేట్‌కు సిద్ధమైంది.ఈ మూడవ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్( Republican Presidential Debate ) గురించి తెలుసుకోవాల్సిన అంశాలు అనేకం వున్నాయి.
మూడవ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ బుధవారం మియామీలో జరగనుంది.‘‘ నైట్లీ న్యూస్ ’’ యాంకర్ లెస్టర్ హోల్ట్, ‘‘మీట్ ది ప్రెస్’’ హోస్ట్ క్రిస్టెన్ వెల్కర్, ‘‘ ది హెగ్ హెవిట్ షో’’ ప్రెజెంటర్ హ్యూ హెవిట్ ఈ కార్యక్రమాన్ని మోడరేట్ చేస్తారు.డిబేట్ స్టేజ్‌లో తమ స్థానాన్ని కాపాడుకోవడానికి అభ్యర్ధులు పలు పోల్స్‌లో 4 శాతం స్టాండింగ్‌ను ప్రదర్శించాలి.70 వేల మంది ప్రత్యేక దాతల మద్ధతును పొందాలి.నవంబర్ 8న చర్చలో పాల్గొనడానికి ఇప్పటికే పలువురు అభ్యర్ధుల అర్హతను నిర్ధారించాయి.

అయితే బుధవారం నాటికి చర్చకు అర్హత పొందినవారిలో పాల్గొనేవారిని జీవోపీ ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు.అయినప్పటికీ అందరూ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగానే వున్నారని నివేదికలు చెబుతున్నాయి.వీరిలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్,( Ron DeSantis ) సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ,( Nikki Haley ) సెనేటర్ టిమ్ స్కాట్, ( Tim Scott ) న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ,( Chris Christie ) బయోటెక్ వ్యవస్థాపకుడు రామస్వామి( Vivek Ramaswamy ) వున్నారు.
అయితే అనూహ్యంగా మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ రేసు నుంచి తప్పుకోవడం గమనార్హం.మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మొదటి, రెండో డిబేట్‌కు గైర్హాజరైన సంగతి తెలిసిందే.
మూడో చర్చా కార్యక్రమానికి కూడా ఆయన దూరంగానే వుండనున్నారు.

చర్చా కార్యక్రమాలకు దూరంగా వుంటున్నా, వరుసగా కేసులు మీద పడుతున్నా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధుల్లో ట్రంప్( Donald Trump ) అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు.2024 అధ్యక్ష ఎన్నికల్లో దిగుతున్నట్లు ప్రకటించి ఏడాది కావొస్తున్నా.ట్రంప్‌కు పోటీనిచ్చే నేత ఇంకా రాలేదు.
రిపబ్లికన్‌లలో బలమైన నేతగా వున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్.ట్రంప్‌కు ప్రత్యామ్నాయం కాగలరని అంతా భావించారు.
కానీ మధ్యలో ఏందుకో ఆయన స్లో అయ్యారు.భారత సంతతికి చెందిన ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి, మాజీ సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ రెండు డిబేట్ల తర్వాత ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
మరో భారత సంతతి అభ్యర్ధి వివేక్ రామస్వామిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు.మరి ఇవాళ్టీ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ ఎంత వాడివేడిగా జరుగుతుందో చూడాలి.







