తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.టికెట్లు అమ్ముకున్న వ్యక్తి సీఎం అయితే ఏం చేస్తారో ప్రజలు గమనించాలని తెలిపారు.
బ్రోకర్ పనులు చేసి వచ్చిన వ్యక్తులు పీసీసీ చీఫ్ అయితే ఇలాగే ఉంటుందని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు.దళిత నేతల దగ్గర కూడా టికెట్ కోసం డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు.
అటు బీజేపీకి కనీసం నాలుగు ఓట్లు వచ్చే పరిస్థితి కూడా లేదన్న మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలిచే స్థితి లేదని చెప్పారు.ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.







