సినీ నటి మాజీ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) భార్య రేణుదేశాయ్( Renu Desai ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు.అంతే కాకుండా ప్రస్తుతం తెలంగాణ ఏపీలో ఎన్నికల హడావిడి కూడా నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈమె బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు కూడా తెలియజేశారు.
ఇకపోతే సోషల్ మీడియాలో తనకు తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే రేణు దేశాయ్ ఒక డాన్స్ వీడియో( Dance Video ) ని షేర్ చేశారు.

ఇందులో భాగంగా తన కుమార్తె ఆద్య( Adhya ) తో కలిసి సరదాగా డాన్స్ చేస్తూ ఉన్నటువంటి వీడియోని షేర్ చేస్తూ…నా ఫేవరేట్ డ్యాన్సింగ్ పార్ట్నర్.మనకు ఇష్టమైన వారితో డాన్స్ చేస్తే థెరపీలా పనిచేస్తుంది అంటూ రాసుకొచ్చింది.అయితే ఈ డాన్స్ వీడియోలో మొదట ఆద్య ఫేస్ కనిపించకపోయిన ఆ తర్వాత ఆధ్య ఎంతో అద్భుతమైనటువంటి స్టెప్పులు వేస్తూ సరదాగా ఎంజాయ్ చేశారు.
ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసినటువంటి ఎంతోమంది అభిమానులు ఈ వీడియో పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.వామ్మో మా ఆద్య తల్లి ఎంత పెద్దదయింది.తల్లికి పోటీగా డాన్స్ చేస్తుందిగా అంటూ కొందరు కామెంట్లు చేయగా ఆధ్యా చాలా అద్భుతంగా డాన్స్ చేస్తుంది అంటూ మరికొందరు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఆద్య ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతున్న సంగతి తెలిసిందే.ఈమె ఆర్కిటెక్చర్ కావాలనేదే తన కళ అంటూ రేణు దేశాయ్ పలు సందర్భాలలో తన కుమార్తె గురించి తెలియజేశారు.
ఇక ప్రస్తుతం ఆధ్యా తన తల్లితో పాటు ఉండగా కుమారుడు అఖీరా మాత్రం ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలలో ఉంటున్న సంగతి తెలిసిందే.







