నటి రేణు దేశాయ్( Renu Desai ).చాలా రోజుల తర్వాత వెండి తెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
జానీ సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తిరిగి రవితేజ( Raviteja ) హీరోగా నటించబోతున్నటువంటి టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం అనే పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రేణు దేశాయ్ సైతం వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె హేమలత లవణం పాత్ర గురించి పలు విషయాలను వెల్లడించారు.

ఈ సినిమాలో హేమలత లవణం ( Hemalatha Lavanam ) పాత్రలో నటించడానికి కంటే ముందుగా తాను లవణం గారి మేనకోడలు కీర్తి గారిని కలిసి ఆవిడ గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని రేణు దేశాయ్ వెల్లడించారు.ఆమె అంటరానితనంపై పోరాటాలు చేశారని బందిపోట్లలో మంచి మార్పు కోసం కృషి చేశారని తెలిసింది.ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల కోసం నిరంతర కృషి చేసినటువంటి హేమలత పాత్రలో నటించడం నా పూర్వజన్మ సుకృతం అంటూ రేణు దేశాయ్ వెల్లడించారు.

హేమలత లవణం బాడీ లాంగ్వేజ్ వెండితెరపై ప్రతిబింబింప చేయడానికి తాను ఎంతో కష్టపడ్డానని ఇది తనకు ఒక సవాల్ గా మారిందని రేణు దేశాయ్ తెలిపారు.జీవితంలో ఇప్పటివరకు ఏ విషయం గురించి పశ్చాత్తాపడలేదు కానీ హేమలత గారి గురించి తెలుసుకున్న తర్వాత ఆమెను స్వయంగా కలవలేకపోయాను అనే బాధ నాలో ఉందని తెలియజేశారు.ఇలా హేమలత పాత్రలో నటించిన చాలా గర్వంగా అనిపిస్తుందని ఇకపై తాను సినిమాలలో చేసే పాత్రలన్నీ కూడా ఇలాంటి పాత్రలలోనే నటిస్తాను అంటూ ఈమె తెలియజేశారు.
ఇక చాలా రోజుల తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమా( Tiger Nageswararao ) ద్వారా వెండితెరపై రేణు దేశాయ్ కనిపించబోతున్నారని విషయం తెలియడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు( Pawan Kkalyan Fans ) కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 25 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.







