అంకుల్ మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది.. ఆ వ్యక్తిపై రేణూదేశాయ్ వ్యంగ్యాస్త్రాలు వైరల్!

ప్రముఖ నటి రేణూ దేశాయ్( Renu deshai ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టైగర్ నాగేశ్వరరావు సినిమా( Tiger Nageswara Rao )లో హేమలత లవణం పాత్రను పోషించిన రేణూదేశాయ్ ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

 Renu Deshai Comments About Senior Journalist Details Here Goes Viral , Renu-TeluguStop.com

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణూదేశాయ్ తనను తక్కువ చేసి మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ పై ఫైర్ అయ్యారు.ఇన్ స్టాగ్రామ్ వేదికగా రేణూదేశాయ్ ఆ సీనియర్ జర్నలిస్ట్ గురించి వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు.

గతంలో తాను సాధించిన విజయాలను రేణూదేశాయ్ గుర్తు చేయడంతో పాటు మహిళలను తక్కువ చేయడం తగదని ఆమె పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ను అంకుల్ అని సంబోధిస్తూ అంకుల్ మీరు నా నామస్మరణ చేసి వ్యూస్ సంపాదిస్తున్నారని నా పేరు వాడుకుని మీరు డబ్బులు సంపాదిస్తున్నందుకు నాకు ఆనందమేనని తెలిపారు.కుర్చీలో కూర్చుని సినిమా నటులపై గాసిప్స్ చెప్పడానికి బదులుగా మీ ప్రతిభతో డబ్బులు సంపాదిస్తే ఇంకా బాగుంటుందని ఆమె అన్నారు.

ఏదైనా మంచి పనులు చేయాలని దేవుని నామస్మరణ చేయాలని ఇంత వయసొచ్చిన తర్వాత కూడా మీ అనుభవం ఇలా ఉందంటే జాలి వేస్తోందని ఆమె కామెంట్లు చేశారు.నేను మిమ్మల్ని ఎప్పుడూ కలవలేదని నా గురించి మీకు తెలియదని కానీ నాపై ఇంటర్వ్యూలు ఇస్తుంటారని రేణూదేశాయ్ అన్నారు.మన కల్చర్ లో స్త్రీలను దుర్గాదేవి, కాళీమాతగా భావిస్తారని రేణూదేశాయ్ పేర్కొన్నారు.

మగవారి పేరు, ప్రోత్సహం లేకుండా మహిళలు ఏం చేయలేరని మీలాంటి వారు మాట్లాడుతుంటారని ఆమె కామెంట్లు చేశారు.సమాజంలో మగవాళ్లకు కొందరు మహిళలపై ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పడానికి ఈ పోస్ట్ పెట్టానని ఆమె అభిప్రాయపడ్డారు.

రేణూదేశాయ్ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.రేణూదేశాయ్ కామెంట్లపై ఆ సీనియర్ జర్నలిస్ట్ ( Senior journalist )స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube