నన్ను అమ్మగా ఎంచుకున్నందుకు థాంక్స్.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్?

సినీనటి, పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాజీ భార్య రేణు దేశాయ్( Renu Desai ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం ఈమె తన ఇద్దరు పిల్లల బాధ్యతలను నిర్వహిస్తూ ఒంటరిగా పిల్లలతో గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే .

 Renu Desai Shares Akira Birthday Special Video Details, Renu Desai, Akira, Akira-TeluguStop.com

ఇలా పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన ఈమె పిల్లల గురించి వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఇప్పటికి ఒంటరిగానే గడుపుతున్నారు.ఇకపోతే ఏప్రిల్ 8వ తేదీ అకిరా పుట్టినరోజు( Akira Birthday ) సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన కుమారుడికి విషెస్ తెలియజేయడమే కాకుండా ఒక ఎమోషనల్ వీడియోని అభిమానులతో పంచుకున్నారు.

ప్రతి ఏడాది అకిరా పుట్టినరోజు సందర్భంగా తన ఫోటోలను వీడియోలను పెట్టాలంటూ అభిమానులు ఈమెను డిమాండ్ చేస్తూ ఉంటారు.కాకపోతే ఇలాంటివి షేర్ చేయడం అకిరా కు ఇష్టం ఉండదు కనుక ఈమె కూడా పెద్దగా తన కొడుకు ఫోటోలను షేర్ చేయదు.అయితే ఈ ఏడాది పుట్టినరోజు సందర్భంగా ఈమె అకీరా( Akira ) కడుపులో ఉన్నప్పటి వీడియోని షేర్ చేస్తూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అకిరా ఎనిమిది నెలల గర్భంలో ఉన్నప్పటి వీడియోని ఈమె షేర్ చేస్తూ ఆ క్షణాలను గుర్తు చేసుకున్నారు.ఆ టైంలో తాను ఎనిమిది నెలల గర్భంతో ఉన్నానని, కడుపులో అకిరా ఉన్నాడని, నన్ను తల్లిగా ఎంచుకున్నందుకు థాంక్స్ అంటూ తన బిడ్డ ఇరవయ్యో ప్రాయంలోకి వచ్చేసాడని తెలిపారు.ఈ విధంగా తన బిడ్డ పొట్టలో ఉన్న విషయాలను గుర్తుచేసుకొని ఈమె పోస్ట్ చేయడంతో ఇప్పటి ఫోటోలను షేర్ చేయండి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇక అకిరా హీరోగా ఇండస్ట్రీ లోకి రాకముందే ఆయనకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube