పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాజీ భార్య, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రేణు దేశాయ్ ( Renu Desai )గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.రేణు దేశాయ్ పవన్ తో కలిసి బద్రి, జానీ సినిమాలో నటించింది.
ఈమె సినిమాల్లోకి అడుగు పెట్టక ముందు మోడల్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది.ఆ తర్వాత హీరోయిన్ గా అడుగు పెట్టింది అలా పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలలో చేయగా.
ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ పుట్టగా పెళ్లికి ముందే అకీరా( Akira )కు జన్మనిచ్చింది.ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
ఇక రేణు దేశాయ్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది.ఇక ఆ సమయంలో వీరికి ఆధ్య( Adhya ) పుట్టింది.
అంత సంతోషంగా ఉంటున్న సమయంలో వారిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో కొంతకాలానికే విడిపోయారు.ఇక అకీరా నందన్, ఆద్యల బాధ్యతలు మొత్తం రేణు దేశాయ్ చూసుకుంటుంది.
పవన్ కళ్యాణ్ కూడా తన ఇద్దరు పిల్లల బాధ్యతలను చూసుకుంటున్నాడని, వారికి కావాల్సినవన్నీ అందిస్తున్నాడు అని గతంలో చాలా వార్తలు వచ్చాయి.

ఇక పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించగా.రేణు మాత్రం పిల్లలతోనే తన జీవితాన్ని కొత్త కొత్తగా మార్చుకుంటుంది.ఇక రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
గతంలో బుల్లితెరపై రీఎంట్రీ కూడా ఇచ్చింది రేణు.ఢీ డ్రామా జూనియర్స్ లో జడ్జిగా కొంతకాలం చేసింది.
ఆ తర్వాత బుల్లితెరకు కూడా దూరంగా ఉండగా కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే అందరికీ టచ్ లో ఉంటుంది.

ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ కు మంచి గౌరవం ఇస్తూ ఉంటారు.ఇక రేణు ప్రతిసారి తన పిల్లలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.సమయం దొరికితే తన పిల్లలతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తన పిల్లలతో కలిసి మరో ట్రిప్ కు వెళ్లినట్లు తెలిసింది.అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది.

అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పంచుకుంది రేణు.అందులో తను సముద్రపు ఒడ్డున నీళ్లలో ఆడుతూ కనిపించింది.ఇక తను ఒక పొట్టి డ్రెస్ వేసుకొని ఉండగా.ఆ నీటి అలల తాకిడికి అక్కడక్కడ తన థైస్ అందాలు కూడా బయటపడుతూ కనిపించాయి.ఇక ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వగా.ఆ వీడియో చూసి పవన్ అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు.
వదినమ్మ జాగ్రత్త అంటూ రేణుకు జాగ్రత్తలు చెబుతున్నారు.ఇక మరి కొంతమంది మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ దీవిస్తూ ఉన్నారు.
ప్రస్తుతం రేణు మాత్రం పిల్లలతో హ్యాపీ మూమెంట్ ని గడుపుతుందని అర్థమవుతుంది.







