Renu Desai : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై మండిపడిన రేణు దేశాయ్.. ఒక తల్లికి పుట్టలేదా అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజి భార్య అయిన రేణు దేశాయ్( Renu Desai ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.

హీరోయిన్​గా బ్రేక్​ఇచ్చిన రేణు దేశాయ్​నటిగా, దర్శకురాలిగా మారి పలు సినిమాలను తెరకెక్కించింది.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె పిల్లలు పుట్టిన తర్వాత 2012లో పవన్ కల్యాణ్​ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

అప్పటి నుంచి పిల్లలను చూసుకుంటూ ఒంటరిగానే గడుపుతోంది.సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

బుల్లితెర పై పలు షోలకు జడ్జిగా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.తరచూ తన కొడుకు కూతురికి సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Advertisement

రేణు దేశాయ్ కి అకిరా నందన్ అనే కొడుకు ఆధ్యా అనే అమ్మాయి ఉన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులపై మండి పడింది.

అసలేం జరిగిందంటే.

ఏప్రిల్ 8న అకీరా నందన్( Akira Nandan ) 19వ పుట్టినరోజు కావడంతో పవన్ కళ్యాణ్ తగ్గట్టుగానే కొడుకు పుట్టినరోజు వేడుకలు జరుగుతాయని అభిమానులు ఆశపెట్టారు.అంతేకాకుండా గత రెండు మూడు రోజులుగా అదే విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా నడిచాయి.పవన్ కళ్యాణ్ తన కొడుకు అకీరాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ అభిమానులు కూడా విషెస్ ని తెలిపారు.ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ మితిమీరి ప్రవర్తించాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

మేడమ్.ఇది చాలా అన్యాయం.

Advertisement

మా అకీరాను ఒక్కసారి అయినా చూపించండి.మా అన్న కొడుకును చూడాలని మాకు ఉంటుంది.

మీరు హైడ్ చేయకండి.

అప్పుడప్పుడు అయినా వీడియోస్ లలో అకీరా బాబును చూపించండి.అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.దీనికి మీ అన్న కొడుకు?? అకీరా నా అబ్బాయి.మీరు ఒక తల్లికి పుట్టలేదా.

మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని నేను అర్థం చేసుకోగలను.కాని ఫస్ట్ కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి.

నేను ఇలాంటి మెసేజ్ లను చాలా ఇగ్నోర్ చేస్తాను.కానీ కొంతమంది మాత్రం హద్దుదాటి చాలా కఠినంగా మాట్లాడుతున్నారు అంటూ మండిపడింది రేణు దేశాయ్.

నేను ఇటువంటి కామెంట్స్ ను సాధారణంగా వదిలేసి డిలీట్ చేసి బ్లాక్ చేసేస్తూ ఉంటాను.కానీ నేడు నా కొడుకు పుట్టిన రోజున ఇలాంటి కామెంట్స్ చదవడం నాకు నిజంగా బాధేస్తోంది.

సెన్స్ లేని కామెంట్ అంటూ రేణు దేశాయ్ ఆ కామెంట్స్ ను స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.సోషల్ మీడియాలో మరో ట్వీట్ చేస్తూ.11 ఏళ్లుగా నన్ను ఒక చెడ్డదానిలా, విలన్ గా చూస్తున్నారు.ఇదంతా చూసి చూసి విసిగి పోయాను.

ఇక ఇలాంటి వాటికి రియాక్ట్ అయి నా మెంటల్ హెల్త్ ను పాడు చేసుకోలేను అని రాసుకొచ్చింది రేణు దేశాయ్.

తాజా వార్తలు