భారత్ లో వన్డే ప్రపంచ కప్ జరగనుంది.అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే మెగా టోర్నమెంట్ ఉన్న నేపథ్యంలో క్రికెట్ స్టేడియాలను పునరుద్ధరించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు స్టేడియాల పునరుద్ధరనకు రూ.502.92 కోట్లను కేటాయించింది.ఈ మేరకు పునరుద్ధరించే ఐదు స్టేడియాల్లో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం కూడా ఉంది.
కాగా వరల్డ్ కప్ లో భాగంగా మొత్తం 48 మ్యాచ్ లు జరగనున్నాయి.దీంతో ఢిల్లీతో పాటు హైదరాబాద్, కోల్ కతా, మొహాలీ, ముంబై స్టేడియాలను మెరుగుపరచనున్నారు.అయితే ఉప్పల్ స్టేడియానికి రూ.117.17 కోట్లు, ఈడెన్ గార్డెన్ కు రూ.127.47 కోట్లు, ఢిల్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, మొహాలీ స్టేడియానికి రూ.79.46 కోట్లతో పాటు ముంబై వాంఖడే స్టేడియానికి రూ.78.82 కోట్లను బీసీసీఐ కేటాయించింది.







