సమాజంలో సక్సెస్ సాధించాలంటే స్త్రీకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.స్త్రీకి కష్టపడి లక్ష్యాన్ని సాధించే సామర్థ్యం ఉన్నా చాలామంది చిన్నచూపు చూస్తారనే సంగతి తెలిసిందే.
అయితే రెనీ జాయ్( Rennie joyy ) అనే ఒక మహిళ మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎంతోమందికి స్పూర్తిగా నిలవడం ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు.ప్రస్తుతం రెనీ జాయ్ ఢిల్లీలో కార్పొరేట్ అడ్వకేట్ గా ఉన్నారు.
రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్ లాండ్( Royal Bank of Scotland ) కు ఆమె వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు.అలేఖ్ ఫౌండేషన్ ద్వారా పేద మహిళలు, పిల్లలకు ఫ్రీగా ఆమె వృత్తివిద్యాకోర్సులను నేర్పిస్తున్నారు.

పేద మహిళలకు కష్టాలు వచ్చిన సమయంలో, ఇబ్బందులు ఎదురైన సమయంలో వాళ్ల తరపున న్యాయ పోరాటం చేస్తున్నారు.అయితే ఆమె ఈ స్థాయికి చేరుకోవడం వెనుక పడిన కష్టం మాత్రం అంతాఇంతా కాదు.మా తాత ఆర్మీ ఉద్యోగి అని దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో ఉద్యోగాలు చేసి చివరకు ఢిల్లీ( Delhi )లో స్థిరపడ్డారని ఆమె చెప్పుకొచ్చారు.మా అమ్మానాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం అని రెనీ జాయ్ పేర్కొన్నారు.
నాన్న నుంచి ఎలాంటి సపోర్ట్ నాకు లేదని ఆమె అన్నారు.బ్యాంకింగ్ రంగంలో నేను కెరీర్ ను మొదలుపెట్టానని రెనీ జాయ్ చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత రోజుల్లో స్టాక్ మార్కెట్( Stock Marketing ) లో కన్సల్టింగ్ పనిలో చేరానని ఆమె తెలిపారు.ఆ బిజినెస్ లో భాగస్వాములు మోసం చేసి నష్టపోయానని ఆమె పేర్కొన్నారు.

స్త్రీల పనికి సమాజంలో త్వరగా అంగీకారం లభించదని రెనీ జాయ్ వెల్లడించారు.తర్వాత రోజుల్లో లీగల్ అడ్వైజర్( Legal Advisor ) గా ముద్ర వేశానని ఆమె చెప్పుకొచ్చారు.నిరుపేద బాలికల చదువును నేను బాధ్యతగా తీసుకున్నానని రెనీ జాయ్ కామెంట్లు చేశారు.రెనీ జాయ్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.







