గత రెండు దశాబ్దాల నుండి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) డామినేషన్ నడుస్తూనే ఉంది.ఇప్పుడు ఆయన వయస్సు దాదాపుగా 74 ఏళ్ళు ఉంటాయి.
ఇప్పటికీ కూడా ఆయనకి వచ్చే వసూళ్లను నేటి తరం స్టార్ హీరోలు అందుకోలేకపోతున్నారు.రీసెంట్ గా విడుదలైన జైలర్ చిత్రం అందుకు ఉదాహరణ.
అంత పెద్ద సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న హీరో కాబట్టే రజినీకాంత్ కి నిర్మాతలు ఒక్కో సినిమాకు 130 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తుంటారు.ఇప్పటి వరకు ఒక్క సౌత్ హీరో కూడా రజినీకాంత్ రెమ్యూనరేషన్ ని దాటలేకపొయ్యారు.
ప్రభాస్ , పవన్ కళ్యాణ్ ( Prabhas , Pawan Kalyan )మరియు రామ్ చరణ్ వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కి ఎదిగారు కానీ, రజినీకాంత్ ని క్రాస్ చేయలేకపోయారు.కానీ రజినీ రెమ్యూనరేషన్ ని ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దాటేసాడని అంటున్నారు ట్రేడ్ పండితులు.

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ కి బౌండరీలు లేకుండా పోయింది.ముఖ్యంగా బాలీవుడ్( Bollywood ) మాస్ ప్రాంతాలలో అల్లు అర్జున్ కి ఖాన్స్ తో సమానమైన క్రేజ్ వచ్చిందంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఆయనకీ కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు నార్త్ ఇండియా లో మాత్రమే కాకుండా, కేరళ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అలాగే తమిళ నాడు, కర్ణాటక లో కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంది.
ఇలా ఏ విధంగా చూసుకున్నా అల్లు అర్జున్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఏ మాత్రం తక్కువ కాదు.ఇంకా చెప్పాలంటే రజినీకాంత్ కంటే ఎక్కువ మార్కెట్ ని ఇండియా లో ఆయన సొంతం చేసుకున్నాడు.
అందుకే ఇప్పుడు చేస్తున్న ‘పుష్ప ది రూల్’( Pushpa The Rule ) కోసం అల్లు అర్జున్ లాభాల్లో 30 శాతం వాటా అడుగుతున్నాడట.అంటే 150 కోట్ల రూపాయలకు పైమాటే అన్నమాట.

ఆ విధంగా అల్లు అర్జున్ రేంజ్ రెమ్యూనరేషన్ పరంగా , పాపులారిటీ పరంగా రజినీకాంత్ ని దాటేశాడు అంటూ ట్రేడ్ పండితులు చెప్తున్నారు.పుష్ప ది రూల్ హిట్ అయితే అల్లు అర్జున్ రేంజ్ ని ఇక ఎవ్వరూ ఊహించలేం అనే చెప్పాలి.శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు 15 వ తారీఖున విడుదల కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ వీడియో కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది .