ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టీఎస్ ఐసెట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి.వరంగల్ లోని కాకతీయ విశ్వ విద్యాలయం ఉప కులపతి రమేశ్ ఈ రిజల్ట్స్ ను విడుదల చేశారు.
ఇందులో మొత్తం 61,613 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు.రాష్ట్రంలోని 272 కళాశాలల్లో అందుబాటులో ఉన్న 27,017 సీట్ల భర్తీ కోసం ఈ పరీక్షను నిర్వహించారు.
అయితే ఈ రిజల్ట్స్ లోనూ ఏపీ విద్యార్థులే టాపర్లుగా నిలిచారు.







