ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.కరోనా కారణం వల్ల ఓటీటీలకు ఎంత మంచి ఆదరణ పెరిగింది ఈ క్రమంలోనే సినిమాలు థియేటర్లో విడుదలైనప్పటికీ ఆ సినిమాలను భారీ ధరలకు ప్రముఖ ఓటీటీ సంస్థలు కొనుగోలు చేసి విడుదల చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలను థియేటర్లను పూర్తయిన వెంటనే ఓటీటీలలో విడుదల చేయటం వల్ల థియేటర్ కి వచ్చే సినిమా చూసే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.ఈ క్రమంలోనే ఓటీటీల విడుదల విషయంలో నిర్మాతలు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు ఒకటవ తేదీ నుంచి సినిమా షూటింగ్ లు నిలిపివేయాలని చిత్రమండలి సంచల నిర్ణయం తీసుకున్నారు.అదేవిధంగా ఓటీటీలలో సినిమాల విడుదల విషయంలో కూడా నిర్మాత మండలి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.
ఈ క్రమంలోనే పరిమిత బడ్జెట్ లో తెరికెక్కిన సినిమాలు థియేటర్ రన్ పూర్తయిన 4 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు.

ఇకపోతే భారీ బడ్జెట్ తో తిరిగిన సినిమాలు తప్పనిసరిగా 10 వారాలు తర్వాతనే ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాత మండలి నిర్ణయించింది.ఇక ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ లో తెరకెక్కిన సినిమాలను ఫెడరేషన్ తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని వెల్లడించారు.టికెట్ల గురించి కూడా మాట్లాడుతూ టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు.
అలాగే సినిమా ప్రదర్శనకు వీపీఎఫ్ ఛార్జీలు ఎగ్జిబిటర్లే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.







