2021 సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైన పుష్ప ది రైజ్ సినిమా తెలుగు రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల్లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.పుష్ప ది రైజ్ సినిమా రిలీజైన సమయంలో ఆ సినిమాకు పోటీగా పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడం, అప్పటికే థియేటర్లలో ఉన్న సినిమాలేవీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోకపోవడం ప్లస్ అయిన సంగతి తెలిసిందే.
పుష్ప తరహా కథాంశంతో ఈ నెల 30వ తేదీన నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీ థియేటర్లలో రిలీజవుతోంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకుడు కాగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే శ్రీకాంత్ ఓదెల స్టార్ డైరెక్టర్ అనిపించుకుంటారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే దసరా సినిమాకు రిలీజ్ డేట్ ఒక విధంగా మైనస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
దసరా మూవీ రిలీజైన రోజున ఇతర భాషల్లో కూడా క్రేజీ సినిమాలు రిలీజవుతుండటంతో దసరా సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది.దసరా రిలీజైన రోజునే దసరా రిలీజ్ రోజున బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ భోళా సినిమా విడుదల కానుందనే సంగతి తెలిసిందే.అజయ్ దేవగణ్ ఫ్యాన్స్ లో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఖైదీ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.తమిళంలో కూడా శింబు పట్టుదల మూవీ రిలీజ్ కానుండగా ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఇతర భాషల్లో కూడా నాని సక్సెస్ సాధించి పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.పుష్పకు ప్లస్ అయిన రిలీజ్ డేట్ దసరాకు మైనస్ కావడం హాట్ టాపిక్ అవుతోంది.







