ఫ్యాన్స్‌ని తిరస్కరించింది.. పొగరు ఎక్కిందా నీ వల్ల అది హిట్ కాలేదంటూ అనుష్కకు ట్విస్ట్?

ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.ఇక తమ అభిమాన నటీనటుల కోసం ఫ్యాన్స్ ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.

కానీ ఒక్కోసారి ఆ ఫ్యాన్సే తమ అభిమాన సెలబ్రెటీల పై ఫైర్ అయ్యే సందర్భాలు కూడా వస్తుంటాయి.చాలా వరకు అలాంటి తప్పులు అభిమానుల నుంచి రావు.

కేవలం తాము అభిమానంగా అనుకున్న నటీనటుల వల్లనే ఫ్యాన్స్ అలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది.నిజానికి నటీనటులు ఒక్క సినిమా హిట్ తోనే తమ స్టేటస్ మొత్తం చూపిస్తారు.

ఒక్క సినిమాకే వారిలో ఎన్నో మార్పులు కనిపిస్తుంటాయి.అంతేకాదండోయ్ కొన్ని కొన్ని సార్లు దర్శకనిర్మాతలను కూడా బెదిరించే స్థాయికి కూడా వస్తుంటారు.

Advertisement

ఇదిలా ఉంటే అనుష్కలో కూడా కాస్త మార్పులు కనిపించడంతో ఓ అభిమాని ఏకంగా అందరిముందు ఆమెపై ఫైర్ అయ్యాడు.టాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ సినిమాతో పరిచయమైన అనుష్క ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుని వరుసగా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.తెలుగులోనే కాకుండా తమిళ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తాను నటించిన అరుంధతి, బాహుబలి, బిల్లా వంటి పలు సినిమాలతో మంచి స్టార్ హోదాను సంపాదించుకుంది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది.

ఇక తన అందంతో ఎంతోమంది కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది.పైగా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఇక మధ్యలో అనుష్క కెరీర్ మొత్తం వరుసగా నాశనం అయ్యింది.తను నటించిన పంచాక్షరి, భాగమతి, సైజ్ జీరో వంటి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవడంతో గా తన కెరీర్ అక్కడినుంచి ఇబ్బందులు ఎదుర్కొంది.

Advertisement

ఇక బాహుబలి సినిమా తో మళ్లీ మంచి క్రేజ్ సంపాదించుకుంది.కానీ ఆ తర్వాత నటించిన నిశ్శబ్దం సినిమా మాత్రం బాగా నిరాశపరిచింది.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు మంచి సక్సెస్ ఉన్న సినిమాల కోసం బాగా ఎదురుచూస్తుంది.

పైగా ఈ మధ్య కొత్త హీరోయిన్స్ ఎక్కువగా రావడంతో అవకాశాలు కూడా అంతగా అందుకోలేకపోతుంది.ఇదిలా ఉంటే అనుష్కకు చాలా వరకు ఎటువంటి ట్విస్ట్ లు రాలేవు.

కానీ కొన్ని ఏళ్ళ కిందట ఓ ట్విస్ట్ ఎదుర్కొంది.అది కూడా ఓ అభిమానితో.ఇంతకీ ఏం జరిగిందంటే.

అనుష్క తమిళ సినిమాలో బిజీగా ఉండగా ఆ సినిమా షూటింగ్ కోసం రాజమండ్రిలో కొన్ని రోజులు బస చేసింది.ఇక రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఆ సినిమా షూటింగ్ జరుగుతుండటంతో అనుష్క అభిమానులు ఆమెను చూడటం కోసం ఒకేసారి చుట్టుముట్టారు.

ఇక అదే సమయంలో ఓ వీరాభిమాని అనుష్క దగ్గరికి వచ్చి తన ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరాడు.కానీ అనుష్క మాత్రం పట్టించుకోకుండా అలాగే వెళ్ళిపోయింది.అయినా కూడా అభిమాని మాత్రం అసలు ఊరుకోలేదు.

దీంతో ఆమె పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి.ఆ అభిమాని అందరి ముందు.

ఏం అరుంధతి హిట్ తో నీకు పొగరెక్కిందా.నీకు తెలియదేమో ఆ సినిమా నీవల్ల హిట్ అవ్వలేదు.

అందులో విలన్ సోనూసూద్ వల్ల, సాయికుమార్ తమ్ముడు వాయిస్ వల్ల హిట్ అయింది అంటూ అనుష్కకు షాక్ ఇచ్చాడు.

అక్కడున్న వాళ్లంతా కూడా అతని మాటలకు ఆశ్చర్యపోయారు.అనుష్క సన్నిహితులు ఆమెతో పబ్లిక్ లో జాగ్రత్తగా ఉండాలి మేడం అంటూ సలహా ఇచ్చారట.ఆ తర్వాత ఆమె ఆ అభిమానిని పిలిపించగా అప్పటికి అతడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు అని తెలిసింది.

దీంతో అప్పటి నుంచి అనుష్క.తన అభిమానులు అడిగిన వెంటనే కాదనకుండా రెస్పాండ్ అవుతూ వస్తుంది.

ఇక ప్రస్తుతం ఈమెకు ఎటువంటి అవకాశాలు లేకపోగా త్వరలోనే తమిళ రీమేక్ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు