పంజాబ్ వద్దంది.. కెనడా కోరుకుంది, కెనడియన్ జాతీయ క్రికెట్ జట్టులో భారతీయుడికి స్థానం

మనదేశంలో ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు లభించక వారు విదేశాలకు వెళ్లి అక్కడ రాణిస్తున్నారు.ఇక్కడి కుల రాజకీయాలు, అవినీతి కారణంగా సరైన ప్రొత్సాహం లభించడం లేదు.

 Rejected By Punjab Gurdaspur Cricketer Selected For Canadian National Team Detai-TeluguStop.com

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్( Gurdaspur ) జిల్లాకు చెందిన ఓ యువ క్రికెటర్‌ ఇక్కడ తిరస్కరణకు గురవ్వగా.ఇప్పుడు అతనికి కెనడా జాతీయ జట్టులో( Canadian National Team ) స్థానం లభించింది.

కెనడా క్రికెట్ జట్టు సెప్టెంబర్ 30 నుంచి బెర్ముడాలో జరిగే ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొంటుంది.ఆయనకు దక్కిన అవకాశంతో రాష్ట్రానికి చెందిన క్రికెటర్లకు షాకిచ్చినట్లయ్యింది.

ఆల్‌రౌండర్ దిల్‌ప్రీత్ సింగ్ బజ్వా (22)( Dilpreet Singh Bajwa ) తన సొంత రాష్ట్రం, దేశంలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆరోపించి ఏకంగా మరో దేశ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడని నమ్మడం చాలా కష్టం.ఈ ఘటన పంజాబ్‌లోని( Punjab ) క్రికెట్, క్రికెటర్ల ఇబ్బందులను, వారి కష్టాలను తెలియజేస్తుంది.

రాష్ట్రంలోని చిన్న జిల్లాలకు చెందిన ఆటగాళ్లు ఎంతటి ప్రతిభావంతులైనా వారికి అరుదుగా అవకాశాలు లభిస్తాయి.పంజాబ్‌‌లోని జిల్లాలను ప్రధాన, చిన్న జిల్లాలుగా వర్గీకరించారు.ఇందులో గురుదాస్‌పూర్ చిన్న జిల్లాల విభాగంలో వుంది.

Telugu Canada, Canada Cricket, Dilpreetsingh, Gurdaspur, Montreal Tigers, Punjab

దిల్‌ప్రీత్. రాకేష్ మార్షల్ శిష్యుడు.ఆయన అకాడమీని నడిపే ప్రభుత్వ కళాశాల మైదానంలో బజ్వా ప్రాక్టీస్ చేసేవాడు.

గురు అర్జున్ దేవ్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాలను విద్యను అభ్యసించాడు దిల్‌ప్రీత్.అతని తండ్రి హర్‌ప్రీత్ సింగ్( Harpreet Singh ) వ్యవసాయ శాఖలో పనిచేస్తుండగా.

తల్లి హర్లీన్ కౌర్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.తమ కొడుకు క్రికెట్ భవిష్యత్ కోసం వీరిద్దరూ 2020లో కెనడాకు( Canada ) వలస వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

కెనడాలో కేవలం మూడేళ్లలోనే దిల్‌ప్రీత్ అద్భుత ప్రతిభ కనబరిచాడు.

Telugu Canada, Canada Cricket, Dilpreetsingh, Gurdaspur, Montreal Tigers, Punjab

దేశవాళీ టోర్నమెంట్ గ్లోబల్ టీ20లో మాంట్రియల్ టైగర్స్( Montreal Tigers ) తరపున ప్రాతినిథ్యం వహించాడు.అతని ప్రదర్శనను గుర్తించిన సెలక్టర్లు జాతీయ జట్టులో స్థానం కల్పించారు.అంతర్జాతీయ క్రికెటర్లు క్రిస్ గేల్, టిమ్ సౌథీ, కార్లోస్ బ్రాత్ వైట్, జేమ్స్ నీషమ్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు గ్లోబల్ టీ20లో పాల్గొంటున్నారు.

గేల్‌కి బజ్వా అంటే చాలా ఇష్టం.సెప్టెంబర్ 30న బెర్ముడాతో జరిగే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ప్రారంభ మ్యాచ్ ఆడేందుకు దిల్‌ప్రీత్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube