డైరెక్టర్ శివ నిర్వాణ( Shiva Nirvana ) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సమంత (Samantha) ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ఖుషి( Kushi ). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో కూడా ప్రసారం కాబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్త నెట్ ఫ్లిక్స్ ఫాన్సీ ధరలకు కొనుగోలు చేస్తుంది.
ఇక ఈ సినిమా అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి డిజిటల్ మీడియాలో ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సమంత భార్యాభర్తలుగా నటించిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్( Romantic Scenes ) కూడా ఉన్నాయి.బెడ్ రూమ్ సన్నివేశాలతో పాటు అలాగే లిప్ లాక్ సన్ని వేషాలను కూడా ఈ సినిమాలో చూపించారు.
అయితే ఈ సన్నివేశాలపై కొన్ని విమర్శలు వచ్చాయి.ఇక ఈ సినిమా విడుదలకు ముందు సెన్సార్ బోర్డు మరికొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కట్ చేసి మరి ఈ సినిమా విడుదలకు పర్మిషన్ ఇచ్చారు.
అయితే ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతున్నటువంటి నేపథ్యంలో సెన్సార్ వాళ్ళు కట్ చేసినటువంటి కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కూడా ఇక్కడ జత చేయబోతున్నారని తెలుస్తుంది.

థియేటర్లోనే ఎన్నో బోల్డ్ సన్నివేశాలను చూపించారు.కట్ చేసినటువంటి సన్నివేశాలతో పాటు ఈ సినిమాని ఓటీటీలో చూసే అవకాశాన్ని మేకర్స్ కల్పిస్తున్నారు.థియేటర్లలో విడుదలైనటువంటి ఈ సినిమా మంచి సక్సెస్ అందుకొని విజయ్ దేవరకొండకు మంచి హిట్ అందించింది.
ఈ సినిమాలో కట్ చేసినటువంటి బోల్డ్ సన్నివేశాలను( Bold Scenes ) పెట్టడం వల్ల ఓటీటీలో ఈ సినిమాకు మరింత ఆదరణ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి.మరి ఈ సినిమా డిజిటల్ మీడియాలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమా అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్( Netflix )లో ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది.