వార్డు సెక్రటరీలకే రిజిస్ట్రేషన్ అధికారాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఆస్తుల క్రయ, విక్రయాలకు సంబంధించి సబ్‌రిజిస్ట్రార్‌లకు ఉన్న డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కంకిపాడుకు చెందిన ప్రసాద్ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది.ఈ క్రమంలో గ్రామస్థాయిలో వార్డు సెక్రటరీలకే రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పిస్తూ ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.అయితే ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది.