చిరంజీవి వయసుపై రెజీనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అది బాగా నచ్చిందంటూ?

రెజీనా కసాండ్రా.ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Regina Says I Like It Very Much In Chiranjeevi, Chiranjeevi, Acharya, Regina, To-TeluguStop.com

మొదట శివ మనసులో శృతి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను దక్కించుకుంది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

బాగా ఈమె నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా ఒక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.ఇక ఇది ఇలా ఉంటే పెద్ద తాజాగా ఈ బ్యూటీ అన్యాస్ ట్యూటోరియల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు పలకరించిన విషయం తెలిసిందే.

ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ హర్రర్ త్రిల్లర్ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి బాగానే స్పందన లభిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా రెజీనా ఆలీతో సరదాగా షోలో పాల్గొంది.

ఈ క్షణంలోనే ఆలీ అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.ఈ నేపథ్యంలోనే ఆలీ ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది అని అడగగా.

కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆ కమర్షియల్ ఎంటర్టైన్ చిత్రం ఆచార్యలో నానా కష్టం అనే స్పెషల్ సాంగ్ లో రెజీనా చిందులు వేసిన విషయం తెలుస్తుంది.ఈ విషయం గురించి ఆలీ ప్రశ్నించగా.

Telugu Acharya, Chiranjeevi, Regina, Tollywood-Movie

ఆ విషయం పై స్పందించిన రెజీనా ఈ వయసులో చిరంజీవి గారు ఏ విషయాన్ని అయినా చాలా త్వరగా నేర్చుకుంటారు.అది నాకు బాగా నచ్చింది.ఆ విషయంలో ఆయన మెచ్చుకోవాల్సిందే.ఆయనతో కలిసి పనిచేయడం నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది అని చెప్పుకొచ్చింది రెజీనా.రెజినా సినిమాల విషయానికి వస్తే.తెలుగు తమిళంలో నేనేనా అనే సినిమాలో నటిస్తోంది.

అలాగే తెలుగులో షాకిని డాకిని అనే సినిమాతో పాటుగా తమిళంలో మరొక మూడు ప్రాజెక్టులు కూడా చేస్తోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube