నయా పైసా ఖర్చు లేకుండా కీళ్ల నొప్పులను ఇలా 7 రోజుల్లో తగ్గించుకోండి!

నేటి దైనందిత జీవితంలో ఇంటికొకరు కీళ్ల నొప్పుల( Joint Pains ) సమస్యతో బాధపడుతూ వున్నారు.అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, రసాయనాలతో తయారు కబడుతున్న ఆహారం తీసుకోవడం వలన చాలా మందిలో యూరిక్‌ యాసిడ్‌ సమస్యలు తలెత్తుతున్నాయి.

 Reduce Joint Pain In 7 Days Without Spending A Penny Details, Money, Saving, Hea-TeluguStop.com

శరీరంలో వ్యర్థ్య పదార్థాలు పేరుకుపోయి కీళ్ల నొప్పులకు దారి తీస్తోంది.దీని కారణంగా పాదాల్లో వాపు, ముడుకుల నొప్పులు వంటి అనేక రకాల నొప్పులు వస్తున్నాయి.

తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.వ్యాయామాలు చేయడం( Exercise ) వలన కూడా ఇలాంటి బాధలను తగ్గించుకోవచ్చు.

అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింది రసాలను తాగితే మంచి ఫలితాలు వుంటాయని డైటీషియన్స్ చెబుతున్నారు.యూరిక్ యాసిడ్ పేషెంట్లు సోరకాయ రసాన్ని ( Bottle Gourd Juice ) తాగాలని సూచిస్తున్నారు.సోరకాయ రసంలో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్ వంటి అనేక రకాల పోషకాలు లభిస్తాయి.దీని కారణంగా శరీరంలో యూరిక్‌ యాసిడ్‌( Uric Acid ) సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

మధుమేహంతో బాధపడుతున్నవారు సోరకాయ రసం ప్రతి రోజు తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు.

అంతేకాకుండా, శరీర బరువును నియంత్రించేందుకు కూడా సోరకాయ జ్యూస్‌ ప్రభావంతంగా సహాయపడుతుందని సమాచారం.ఈ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండి, ఊబకాయం సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా అధిక రక్తపోటు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు.

కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి సోరకాయ రసం ప్రతి రోజు తాగితే మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube