బుల్డోజర్ పేరు వినగానే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్( Yogi Aditya Nath ) అందరికీ గుర్తుకు వస్తాడు.అక్కడ ఎన్నికల సమయంలో ఎక్కువగా బుల్డోజర్ నినాదం వినబడేది.
అక్కడ అనధికారికంగా కట్టిన ఇళ్లను కూల్చేందుకు అనధికారికంగా ఆయన వాడుతున్న ఆయుధం బుల్డోజర్.అయితే అదే బుల్డోజర్ ఇపుడు గుజరాత్ ప్రజల ప్రాణాలను కూడా కాపాడుతోంది.
అవును, కచ్ ప్రాంతంలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి.ఈ నేపథ్యంలో చిన్న వాగులను దాటేందుకు ఈ ప్రాంత ప్రజలు కొత్త మార్గాన్ని కనుగొన్నారు.

విషయంలోకి వెళితే, ఇవతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి వెళ్లేందుకు… బుల్డోజర్ ను నిలిపి బకెట్ సాయంతో ప్రజలను తరలించేందుకు బుల్డోజర్ సాయం తీసుకున్నారు.అవును, వినడానికి చిత్రంగా వున్నా ఇది నిజం.కావాలంటే ఇక్కడ వీడియో చూడండి.దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవడంతో నెటిజన్లు దానిపైన రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.బాబా బుల్డోజర్ అక్రమ నిర్మాణాలను( Baba bulldozer illegal constructions ) కూలదోయడమే కాదు, జనాలను రక్షించడంలోనూ ముందుంటుంది అని కొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఇకపోతే ఉత్తర ప్రదేశ్‌లో( Uttar Pradesh ) ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ పట్ల ఆగ్రా యువతలో గొప్ప క్రేజ్ ఏర్పడిందనే విషయం విదితమే.ఈ క్రమంలో హిందూ, ముస్లిం యువత తమ చేతులపై బుల్డోజర్ టాటూలను వేయించుకుంటున్నారు.శాసనసభ ఎన్నికల్లో బుల్డోజర్ పదం అయితే తెగ వైరల్ అయింది.
ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నవారిపై గత ఐదేళ్లలో యోగి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది.ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూకటివేళ్లతో పెకలించి వేసింది.
దీంతో బుల్డోజర్లకు భారీ క్రేజ్ ఏర్పడింది.యోగి ఆదిత్యనాథ్‌ను ‘బుల్డోజర్ బాబా’గా ఆయన మద్దతుదారులు, వ్యతిరేకులు పిలుస్తున్నారు.







