ప్రధాన పప్పు దినుసుల పంటలలో కంది పంట( Red Gram Cultivation ) కూడా ఒకటి.కంది పంటను వర్షాధార పంటగా సాగు చేయవచ్చు.
నీటి వసతి ఉంటే అధిక దిగుబడులు పొందవచ్చు.కంది పంట సాగుకు దాదాపుగా అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి.
నీరు నిల్వ ఉండని నేలలు, నల్ల రేగడి నేలలు కంది పంట సాగుకు చాలా అనుకూలం.కంది పంటకు చీడపీడల, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువ.
కాబట్టి తెగులు నిరోధక మేలురకం విత్తనాలను సాగుకు ఎంపిక చేసుకోవాలి.ఒక ఎకరం పొలానికి రెండు కిలోల విత్తనాలు9 Seeds ) అవసరం.
విత్తనాలను ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి.ఒక కిలో విత్తనాలను ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేదంటే 3 గ్రాముల థైరం తో విత్తన శుద్ధి చేసుకోవాలి.

కంది మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే, చీడపీడల, తెగుళ్ల బెడద తక్కువగా ఉండాలంటే, మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలే విధంగా నాటుకోవాలి.అంటే మొక్కల మధ్య కనీస దూరం 25 సెంటీమీటర్లు, మొక్కల సాలుల మధ్య కనీస దూరం 120 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తనం విత్తుకోవాలి.మొక్కలు ఎక్కువ ఎత్తుగా పెరిగితే మొక్క యొక్క చివర్లను ఒక అడుగు పొడవు వరకు చివర్లను కత్తిరించుకోవాలి.వేసవికాలంలో( Summer Season ) లోతు దుక్కులు దున్నుకుంటే, బ్యాక్టీరియా, వైరస్ లాంటివి పూర్తిగా నాశనం అవుతాయి.
కలుపు విత్తనాలు కూడా దాదాపుగా నాశనం అవుతాయి.ఇక నేల వదులుగా అయ్యేలాగా రెండు లేదా మూడుసార్లు దమ్ము చేసుకోవాలి.

ఎరువుల విషయానికి వస్తే.ఒక ఎకరానికి నాలుగు టన్నుల పశువుల ఎరువు( Fertiliser ), ఎనిమిది కిలోలు నత్రజని, 20 కిలోల భాస్వరం ఎరువులను చివరి దుక్కిలో వేసి, దమ్ము చేసుకుని విత్తనానికి సిద్ధం చేసుకోవాలి.కలుపు సమస్యను అధిగమించాలంటే.విత్తనం విత్తిన రెండు రోజుల లోపు ఐదు మిల్లీలీటర్ల పెండిమిథలిన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.ఇక కంది మొక్కలు రెండు లేదా మూడు అడుగుల పొడవు పెరిగిన తర్వాత గొర్రు లేదా గుంటక తో అంతర కృషి చేయాలి.కంది పంటలో అధిక దిగుబడి సాధించాలంటే ఎప్పటికప్పుడు కలుపు మొక్కల నివారణ చేస్తూనే ఉండాలి.
అప్పుడే వివిధ రకాల తెగుళ్ల చీడపీడల బెడద చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది.