Pallavi Prashanth : బుల్లితెరపై కనిపించని పల్లవి ప్రశాంత్… ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) పరిచయం అవసరం లేని పేరు.ఒక కామన్ మ్యాన్ గా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ రైతు బిడ్డగా పొలం పనులు చేయడమే కాకుండా ఆ పనులకు సంబంధించినటువంటి అన్ని విషయాలను ఈయన వీడియోల రూపంలో సోషల్ మీడియా వేదికగా అందరికీ షేర్ చేసేవారు.

 Reasoon Behind Bigg Boss Pallavi Prashanth Not Attending Tv Shows-TeluguStop.com

ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు ఏకంగా బిగ్ బాస్ ( Bigg Boss ) అవకాశం వచ్చింది.ఒక కామన్ మాన్ గా హౌస్ లోకి అడుగు పెట్టినటువంటి ప్రశాంత్ చివరికి సెలబ్రిటీ హోదా అనుభవించడమే కాకుండా బిగ్ బాస్ విన్నర్ ( Bigg Boss Winner) గా బయటకు వచ్చారు.

బిగ్ బాస్ కార్యక్రమంలో ఈయన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.దీంతో గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు బయట కాస్త అత్యుత్సాహం కనబరిచారు.దీంతో పల్లవి ప్రశాంత్ ఏకంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.ఇలా జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా కనిపించి సందడి చేశారు.

ఇక ఇటీవల కాలంలో ఈయన బుల్లితెర కార్యక్రమాలకు( TV Shows ) కూడా దూరమయ్యారు.

ఇలా బుల్లితెరకు దూరమైనటువంటి పల్లవి ప్రశాంత్ ఏం చేస్తున్నారనే అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి.అయితే ఈయన బుల్లితెరకు దూరమై తిరిగి తన వ్యవసాయ పనులలో( Agricultural Works ) నిమగ్నమయ్యారని తెలుస్తుంది.అయితే తన వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్నప్పటికీ ఈయన మాత్రం సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు.

ఖరీదైన కార్లలో తిరుగుతూ సెలబ్రిటీగా ఎంజాయ్ చేస్తున్నారు.ఇక ప్రశాంత్ ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున అభిమానులు తనని చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు.

ఇక తన తల్లిదండ్రులతో కలిసి పొలాలలో రీల్స్ కూడా చేస్తూ ఈయన ఎంతో బిజీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube