విరాటపర్వం మూవీ డబుల్ డిజాస్టర్ కావడానికి అసలు కారణాలు ఇవే!

ఈ మధ్య కాలంలో భారీ అంచనాలతో విడుదలై డబుల్ డిజాస్టర్ గా నిలిచిన సినిమాలలో విరాటపర్వం సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది.

 Reasons Behind Virataparvam Movie Double Disaster Result Details Here , Double Disaster, Intersting Comments, Shocking Facts, Virataparvam, Rana , Saipallavi-TeluguStop.com

అయితే బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమాకు 30 శాతం కలెక్షన్లు కూడా రాలేదు.ఫలితంగా విరాటపర్వం సినిమా బాక్సాఫీస్ వద్ద డబుల్ డిజాస్టర్ గా నిలిచింది.

అయితే వేణు ఊడుగుల అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఈ సినిమా ఫెయిలైంది.సాయిపల్లవిపైనే దర్శకుడు దృష్టి పెట్టడంతో సినిమాలో ఏ పాత్రకు తగిన న్యాయం జరగలేదు.

 Reasons Behind Virataparvam Movie Double Disaster Result Details Here , Double Disaster, Intersting Comments, Shocking Facts, Virataparvam, Rana , Saipallavi-విరాటపర్వం మూవీ డబుల్ డిజాస్టర్ కావడానికి అసలు కారణాలు ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాలానికి అనుగుణంగా సినిమాలను చూసే ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి.థియేటర్ కు వచ్చి సినిమా చూడాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

దర్శకుడు నిజాయితీగా సినిమా తీసినా ప్రేక్షకులు మాత్రం సినిమాను ఆదరించలేదు.

చాలామంది ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ సినిమా అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒకవేళ ఓటీటీలలో రిలీజ్ చేసి ఉంటే మాత్రం ఈ సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాలో హీరోగా నటించిన రానాకు సైతం పాత్ర విషయంలో పూర్తిగా న్యాయం జరగలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించలేదు.

Telugu Double Disaster, Virataparvam-Movie

విరాటపర్వం సినిమా స్క్రిప్ట్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే దర్శకుడు ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుని ఉండేవారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విరాటపర్వం దర్శకుడికి కొత్త సినిమా ఆఫర్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.హీరో రానా తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సోలో హీరోగా నటించిన సినిమాలు రానాకు కలిసిరావడం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube