రావణాసుర మూవీ డిజాస్టర్ కావడానికి ఈ 5 తప్పులే కారణమయ్యాయా?

ఈ నెల 7వ తేదీన థియేటర్లలో విడుదలైన రావణాసుర( Ravanasura _ మూవీ నెగిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ట్విస్టులు బాగానే ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా నెటిజన్లకు ఒకింత భారీ షాక్ ఇచ్చిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా డిజాస్టర్ కావడానికి 5 తప్పులే కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రావణాసుర సినిమాలో రవితేజ( Ravi teja ) మార్క్ ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు అస్సలు లేవు.రవితేజ లాయర్ గా కనిపించినా కథకు ఆ పాత్ర వల్ల పెద్దగా ఉపయోగం లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది.

రావణాసుర సినిమాలో ఎక్కువ సంఖ్యలో హీరోయిన్లు ఉన్నా ఒక్క హీరోయిన్ పాత్ర కూడా సరిగ్గా లేదు.ఆ పాత్రలకు క్రేజ్ ఉన్న హీరోయిన్లను సైతం ఎంపిక చేయాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి./br>

Advertisement

శృతిమించిన రొమాన్స్ సన్నివేశాలు కూడా ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.క్లైమాక్స్ లో హీరో గురించి పాజిటివ్ గా చెప్పించినా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చని విధంగా కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో ఉండటం గమనార్హం.దర్శకుడు సుధీర్ వర్మ తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాను అద్భుతమైన థ్రిల్లర్ గా ఒకే జానర్ లో తెరకెక్కించాలని భావించి కథ, కథనం విషయంలో తప్పటడుగులు వేస్తున్నారు.

హైపర్ ఆది ( Hyper Aadi )కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉండగా ఈ సినిమాకు మాత్రం ఆయన కామెడీ మైనస్ అయింది.ఈ 5 తప్పులు రావణాసుర సినిమాకు మైనస్ అయ్యాయి.ఈ సినిమాకు కలెక్షన్లు సైతం ఆశాజనకంగా లేవు.

రవితేజ వేగంగా సినిమాలు చేయడం కంటే కథ, కథనం అద్భుతంగా ఉన్న సినిమాలలో నటిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు